అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రమణారెడ్డికి చెందిన రెండు వేల బొప్పాయి చెట్లను టీడీపీ కార్యకర్తలు నరికేశారు.
సుదీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన గర్వంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రమణారెడ్డికి చెందిన రెండు వేల బొప్పాయి చెట్లను టీడీపీ కార్యకర్తలు నరికేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లిలో చోటుచేసుకుంది.
గతంలో కూడా తిరుపతి, అనంతపురం తదితర ప్రాంతాల్లో తెలుగుతమ్ముళ్లు ఇలాగే అరాచకాలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై వ్యక్తిగతంగా దాడులు చేయడం, వాళ్ల ఆస్తులు ధ్వంసం చేయడం, పవిత్రమైన తిరుమల కొండపైకి తాగి వెళ్లి అక్కడి దుకాణాలను ధ్వంసం చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు.