టీడీపీకి గుంటూరు రాజేశ్వరి రాజీనామా | TDP Guntur RAJESWARI resignation | Sakshi
Sakshi News home page

టీడీపీకి గుంటూరు రాజేశ్వరి రాజీనామా

Published Thu, May 12 2016 3:45 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

టీడీపీకి గుంటూరు రాజేశ్వరి రాజీనామా - Sakshi

టీడీపీకి గుంటూరు రాజేశ్వరి రాజీనామా

చంద్రగిరి : టీడీపీ అనుబంధ సంఘమైన టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి గుంటూరు రాజేశ్వరి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆమె మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏపీకి ప్రత్యేక హోదా తెస్తారని నమ్మి ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు. కేంద్రం ఏపీకి హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినా సీఎం దానిపై ఎటువంటి వ్యాఖ్యాలూ చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మంత్రులు సైతం ఈ విషయంలో నోరుమెదపకపోవడం విచారించదగ్గ విషయమన్నారు.

రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు తన సొంత జిల్లాను సైతం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వైఖరి నచ్చకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement