సాక్షి, విజయవాడ : రెండు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాలుపెట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లాక్‌డౌన్ నిబంధనలను పాటించలేదు. చంద్రబాబు వస్తున్నారని హంగామా చేసిన తెలుగు తమ్ముళ్లు లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు. మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికారు. జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్లలో మాజీ ఎమ్మెల్యేల శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్యలు టీడీపీ జెండాలతో చంద్రబాబు స్వాగతం పలికేందుకు వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు కారు బయటకు వచ్చి టీడీపీ శ్రేణులకు అభివాదం తెలిపారు.
కొందరైతే చంద్రబాబు కాన్వాయ్ వెంట బైక్ ర్యాలీ చేపట్టారు. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించాల్సిందిగా పోలీసులు సర్దిచెప్పినప్పటికీ.. టీడీపీ కార్యకర్తలు, నాయకులు పట్టించుకోలేదు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలి అని చెప్పాల్సిన చంద్రబాబు.. అందుకు భిన్నంగా వ్యవహరించడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో చంద్రబాబు టీడీపీ శ్రేణులను అదుపులో ఉంచాల్సిందిపోయి.. వారిని ప్రోత్సహించేలా వ్యవహరించడమేమిటని ప్రశ్నించారు.(చదవండి : రెండు నెలల తర్వాత ఏపీకి చంద్రబాబు)
Comments
Please login to add a commentAdd a comment