'రియల్ ఎస్టేట్ కు టీడీపీ నేతల దన్ను'
విజయవాడ: రాజధానిపై అస్పష్టమైన ప్రకటనలతో టీడీపీ తీవ్ర గందరగోళానికి తెరలేపిందని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ విమర్శించారు. గుంటూరు-విజయవాడ-అమరావతి మధ్య 23 వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం భూసేకరణ జరపాలంటే పదేళ్లు పడుతుందన్నారు.
ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న తర్వాతే రైతుల భూసేకరణ గురించి ఆలోచించాలని సూచించారు. రియల్ ఎస్టేట్ ను ప్రోత్సహించేవిధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. విజయవాడలో ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన జాతీయ భూసేకరణ చట్టంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.