విశాఖలోని విప్రో, టెక్ మహీంద్రా సంస్థలను నలుగురు ఎమ్మెల్యేల బృందం మంగళవారం సందర్శించింది.
విశాఖ : విశాఖలోని విప్రో, టెక్ మహీంద్రా సంస్థలను నలుగురు ఎమ్మెల్యేల బృందం మంగళవారం సందర్శించింది. ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్ రాజు, గణేష్ కుమార్, పల్లా శ్రీనివాస్ ...రెండు సంస్థలను సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల కప్పనలో విప్రో సంస్థ విఫలమైందని ఆరోపించారు. ఇప్పుడు ఎస్ఈజెడ్లో వర్తింపచేయాలని కోరటం విడ్డూరంగా ఉందన్నారు. అయిదేళ్లలో రెండువేల మందికి ఉద్యోగాలు ఇస్తామన్న విప్రో... ఏడేళ్లు అవుతున్నా ఇప్పటికి 600మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయిందన్నారు.