tech mahendra
-
సీఎం జగన్ ను కలిసిన టెక్ మహేంద్ర ఎండీ, సీఈవో గుర్నాని
-
ఏపీ వైపు ఐటీ దిగ్గజాల చూపు..
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత ఐటీ కంపెనీలు చిన్న పట్టణాల వైపు చూస్తుండటంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి వివరిస్తోంది. దీంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అసెంచర్, హెచ్‌సీఎల్, అదానీలతో పాటు ఐటీ పార్కులను నిర్మించే రహేజా వంటి సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 3,000 సీటింగ్ సామర్థ్యంతో విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, తొలి విడతలో 1,000 మందితో ప్రారంభించనుంది. ఇందుకోసం మధురవాడ సమీపంలో అందుబాటులో ఉన్న బిల్డింగ్‌లను ఇన్ఫోసిస్‌కు చూపించామని, ఒకటి రెండు నెలల్లో ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో విజయవాడలో ఇప్పటికే ఉన్న హెచ్‌సీఎల్.. తన కార్యకలాపాలను విశాఖకు విస్తరించే యోచనలో ఉంది. విశాఖలో మరో భారీ కేంద్రం ఏర్పాటుకు గల అవకాశాలను హెచ్‌సీఎల్ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. వివిధ రంగాల్లో విస్తరించి ఉన్న అదానీ గ్రూపు రూ.14,634 కోట్ల పెట్టుబడితో 130 ఎకరాల విస్తీర్ణంలో డేటా సెంటర్‌తో పాటు ఐటీ పార్కు, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన పనులను త్వరలో ప్రారంభించనుంది. యాంకర్ కంపెనీలు విశాఖకు వస్తుండటంతో ఐటీ పార్కుల నిర్మాణ రంగ సంస్థల చూపు ఇప్పుడు ఆ నగరంపై పడింది. ఐటీ పార్కుల నిర్మాణ సంస్థ రహేజా గ్రూపు విశాఖలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఇన్ ఆర్బిట్‌మాల్ షాపింగ్ మాల్తో పాటు ఐటీ పార్కు నిర్మాణం చేపట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ పోర్టుకు సంబంధించిన 17 ఎకరాల భూమిని రహేజా గ్రూపు కొనుగోలు చేసింది. విజయవాడకు టెక్ మహీంద్ర టెక్ మహీంద్రా తన కార్యకలాపాలను విజయవాడకు విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో సీపీ గుర్నాని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తెలియజేశారు. ఇప్పటికే విశాఖలో ఉన్న తాము విజయవాడలో కూడా అడుగు పెట్టామంటూ సీఎంను కలిసిన అనంతరం గుర్నానీ ట్వీట్ చేశారు. అంతకు ముందు దావోస్‌లో గుర్నానిని కలిసిన సీఎం జగన్.. రాష్ట్రంలో కార్యకలాపాలను మరింతగా విస్తరించాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. విజయవాడాలోని మేథా టవర్స్‌లో ప్రస్తుతం 100 మందితో కార్యకలాపాలను ప్రారంభించగా, త్వరలో ఆ సంఖ్యను 1,000కి చేర్చాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తగిన భవనాలను కోసం అన్వేషిస్తోంది. మరో ఐటీ దిగ్గజ సంస్థ అసెంచర్స్ కూడా విజయవాడలో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. 1,000 మంది సీటింగ్ సామర్థ్యంతో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా తొలుత 200–300 సీటింగ్ సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇదే సమయంలో ఇండియాకు చెందిన అతి పెద్ద ఐటీ కంపెనీ ఒకటి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. రాష్ట్రంలో ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా విశాఖ వేదికగా ఒక భారీ ఐటీ సదస్సును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. కోవిడ్‌తో చిన్న ఊళ్ల వైపు చూపు అంతర్జాతీయంగా పని చేస్తున్న ఐటీ నిపుణుల్లో 20 శాతం మంది మన రాష్ట్రం నుంచే ఉన్నారని అంచనా. ప్రతి ఐదుగురిలో ఒకరు మన రాష్ట్రం నుంచి ఉన్నట్లు వివిధ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కోవిడ్ తర్వాత చాలా మంది బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి ఆఫీసులకు వెళ్లి పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో 10 శాతం మించి ఉద్యోగులు ఆఫీసులకు రావడం లేదు. ఇదే అంశాన్ని వివరిస్తూ ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. తక్షణం ప్రభుత్వం వద్ద బిల్డింగ్లు లేకపోవడంతో అందుబాటులో ఉన్న ప్రైవేటు బిల్డింగ్‌లలో కార్యకలాపాలు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నాం. ఐటీ కంపెనీలను ఆకర్షించే విధంగా రాయితీలతో పాటు, వాటి కార్యకలాపాలు సజావుగా సాగేలా అపిటా (ఏపీఈఐటీఏ– ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ) ద్వారా చేయూత అందిస్తున్నాం. ప్రభుత్వ చర్యలపై కంపెనీలకు నమ్మకం పెరగడంతో ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకు వస్తున్నాయి. – ఎం.నందకిషోర్, ఎండీ, ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ (ఏపీటీఎస్) చిన్న కంపెనీల ఏర్పాటుకు మార్గం సుగమం ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, అసెంచర్స్ వంటి ఐటీ యాంకర్ కంపెనీలు రాష్ట్రానికి వస్తుండటంతో వాటికి అనుబంధంగా అనేక చిన్న కంపెనీలు ఏర్పాటు కావడానికి మార్గం సుగమం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేయనున్న హై ఎండ్ స్కిల్ యూనివర్సిటీ అందుబాటులోకి వస్తే మర్ని ఐటీ కంపెనీలు విశాఖకు క్యూ కడతాయి. ఐటీ కంపెనీలను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితాలు ఇస్తోంది. త్వరలో స్థానిక యువతకు ఇక్కడే ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నాం. – శ్రీధర్ కోసరాజు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఏపీ (ఐటాప్) -
ఏపీ సీఎం జగన్‌ను కలిసిన టెక్ మహీంద్ర ఎండీ
-
నాకు బతకాలనిపించడం లేదు
సాక్షి, రాంగోపాల్‌పేట్(సికింద్రాబాద్): తనకు బతకాలనిపించడంలేదని సోదరితో చెప్పిన రెండ్రోజులకే ఆ యువతి తనువు చాలించింది. నగరంలోని టెక్ మహీంద్రా సంస్థలో పనిచేసే ఓ యువతి అదే కార్యాలయంలోని ఆరో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నామాలగుండ ఉప్పరబస్తీకి చెందిన వస్త్ర వ్యాపారి రంగన్ గోవిందరాజ్, శీల దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె గోవిందరాజు సుస్మిత (21) క్లాక్‌టవర్ ప్రాంతంలోని టెక్ మహీంద్రాలో ఈ ఏడాది అక్టోబర్ 30న శిక్షణ కోసం చేరింది. శిక్షణ పూర్తయిన అనంతరం ఈ నెల 13న ఇక్కడే అసోసియేట్ కస్టమర్ సపోర్ట్‌గా విధులు నిర్వహిస్తోంది. ప్రతి రోజు ఉదయం గోవిందరాజ్ కుమార్తెను తన ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చి కార్యాలయం వద్ద వదలి వెళుతుంటారు. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం: మృతుల్లో ఆరుగురు చిన్నారులు చైర్లు వేసుకుని.. ప్రతిరోజులాగే గురువారం ఉదయం 9.30 గంటలకు ఆయన సుస్మితను వదలివెళ్లారు. 10 గంటలకు ఆమె విధుల్లో చేరాల్సి ఉండగా 9.40 నిమిషాలకు ఆరో అంతస్తులోని క్యాంటిన్‌కు వెళ్లి అక్కడి నుంచి వాష్‌రూమ్‌కు వెళ్లింది. బాత్రూం పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి చైర్లు వేసుకుని పైకి ఎక్కి గ్రిల్స్ లేని కిటికి నుంచి కిందకు దూకింది. వెంటనే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది హుటాహుటిన అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే చనిపోయింది. విషయం తెలుసుకున్న గోపాలపురం పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పెళ్లి కావట్లేదని యువతి ఆత్మహత్య పోలీసుల విచారణ.. రెండు రోజుల క్రితం సోదరితో తనకు భూమి మీద జీవించాలని అనిపించడం లేదని అన్నట్లు తెలిసింది. ఆత్మహత్యకు ముందు కూడా తోటి ఉద్యోగినితో కూడా ఇలాగే మాట్లాడినట్లు తెలిసింది. అయితే ఆమెకు ఇంట్లో ఎక్కడ ఎలాంటి సమస్యలు లేవు. ఉద్యోగంలో చేరి కూడా 5 రోజులు మాత్రమే కావడంతో ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవు. ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె చనిపోయే ముందు చివరి కాల్ ఎవరికి చేసింది అనేది పోలీసులు పరిశీలిస్తున్నారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు.. విషయం తెలుసుకున్న సుస్మిత తల్లిదండ్రులు హుటాహుటిన టెక్ మహీంద్రా కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే మృతదేహాన్ని తరలించారు. తమ కుమార్తె చనిపోయిందని తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. -
3నెలల్లో 20శాతం వరకు రాబడినిచ్చే 3 షేర్లు ఇవే..!
మార్కెట్ ర్యాలీ మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు వికాస్ జైన్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ర్యాలీలో మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ షేర్ల ప్రదర్శన తక్కువగా ఉందని, రాబోయే కొద్ది వారాల్లో ఈ షేర్లలో అద్భుతమైన ర్యాలీని చూడవచ్చని జైన్ అంటున్నారు. నిఫ్టీ ఇండెక్స్ అప్‌సైడ్‌లో 9,750 వద్ద నిరోధ స్థాయిని కలిగి ఉందని, దాన్ని అధిగమిస్తే 9,800 వద్ద మరో నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని జైన్ అంచనా వేస్తున్నారు. ఇక్ డౌన్‌సైడ్‌లో 9,250వద్ద కీలక మద్దతు స్థాయిని కలిగి ఉందని, ఈ స్థాయిని కోల్పోతే 9,050వద్ద మరో కీలక మద్దతు ఉందన్నారు. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ప్రదర్శన రానున్న రోజుల్లో కొనసాగే అవకాశం ఉందని జైన్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జైన్ 3నెలల వ్యవధిలో 20శాతం వరకు రాబడులనిచ్చే 3స్టాకులను సిఫార్సు చేశారు. షేరు పేరు: సెంచురీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.340 స్టాప్ లాస్: రూ.253 అప్ సైడ్: 20శాతం విశ్లేషణ: ఈ షేరు నెలవారీ ఎక్స్పైరీ ఛార్ట్‌లో హమ్మర్ క్యాండిల్ ప్యాట్రన్ రూపొందించింది. హయ్యర్ సైడ్‌లో బలమైన రివర్సల్ బ్రేక్అవుట్ను ఆశించవచ్చు. బలమైన వ్యాల్యూమ్స్‌తో షేరు 4వారాల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతోంది. ఆర్ఎస్ఐ గత కొన్నివారాల నుంచి యావరేజ్ లైన్‌పై ట్రేడ్ అవుతోంది. కాబట్టి ట్రేడర్లు రూ.253ని స్టాప్ లాస్‌గా నిర్దేశించుకొని రూ.340 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చు. షేరు పేరు: కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.410 స్టాప్ లాస్: రూ.324 అప్‌సైడ్: 17శాతం విశ్లేషణ: ఈ షేరు దాని స్వల్ప మరియు మధ్యకాలిక యావరేజ్‌ల దగ్గర ట్రెండ్ అవుతోంది. ప్రస్తుత స్థాయిల నుండి పైకి బ్రేక్అవుట్ కావొచ్చు. వీక్లీ ఛార్ట్‌లో హయ్యర్ బాటమ్‌ను ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో పాజిటివ్ అవుట్‌లుక్‌ను ఆశించవచ్చు . షేరు పేరు: టెక్ మహీంద్రా రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.595 స్టాప్ లాస్: రూ.491 అప్ సైడ్: 12శాతం విశ్లేషణ: ఈ షేరుకు త్రైమాసికపు సగటు రూ.485 వద్ద కీలక మద్దుత స్థాయిని కలిగి ఉంది. ఇది తక్కువ శ్రేణి నుండి సానుకూల మూమెంటంను అందుకుంది. కీలకమైన ఆర్ఎస్ఐ ఇండికేటర్ దాని యావరేజ్ లైన్‌కు పైన ట్రేడ్ అవుతోంది. ఇది ప్రస్తుత స్థాయిల నుంచి బ్రేక్ అవుట్ అయ్యి తదుపరి ర్యాలీకి సిద్ధమవడాన్ని సూచిస్తుంది. -
ప్రైవేట్ యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ సంస్థలు ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూ ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను గురువారం జారీ చేసింది. మల్లారెడ్డి మహిళా వర్సిటీని మైసమ్మగూడలో ఏర్పాటు చేసేందుకు ఓకే చెబుతూ ఎల్వోఐ జారీ చేసింది. ఈ మేరకు మల్లారెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి సీహెచ్ మహేందర్‌రెడ్డికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామంద్రన్ ఉత్తర్వులిచ్చారు. ఈ ఎల్వోఐ ఆధారంగా ఆ విద్యా సంస్థ వర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. రూ.10 కోట్ల కార్పస్ ఫండ్, మూడేళ్ల పాటు ఉండేలా రూ.30 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్, ప్రాజెక్టు విలువలో 1% ఎండోమెంట్ ఫండ్ లేదా రూ.10 కోట్లు వెచ్చించడంతోపాటు తగిన భవనాలు, వాటిల్లో సదుపాయాలు ఏర్పా టు చేయాల్సి ఉంటుంది. ఆరు నెలల్లోగా అవి పూర్తి చేశాక ప్రభుత్వం లెటర్ ఆఫ్ అప్రూవల్‌ను జారీ చేయనుంది. మల్లారెడ్డి మహిళా వర్సిటీతోపాటు టెక్ మహీంద్రా వర్సిటీ ఏర్పాటుకు కూడా ఎల్వోఐ ఇచ్చింది. వచ్చే వారం రోజుల్లోగా అనురాగ్, గురునానక్ , శ్రీనిధి, ఎంఎన్ఆర్, నిప్‌మర్, వోక్సన్, ఎస్ఆర్ విద్యాసంస్థలకు ఎల్వోఐ జారీ చేసే అవకాశం ఉంది.న్నాయి. -
ఫేక్‌కాల్స్ నియంత్రణకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ టెక్ మహీంద్రా తాజాగా టెలికం విభాగంలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఫేక్ కాల్స్, మెసేజ్‌లను నియంత్రించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని, 30 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని కంపెనీ తెలియజేసింది. గతేడాది బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అభివృద్ధి చేశామని, 25 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నామని కంపెనీ గ్లోబల్ ప్రాక్టీస్ లీడర్ రాజేశ్ దుడ్డు గురువారమిక్కడ ఓ కార్యక్రమంలో చెప్పారు. టెలికంతో పాటు తయారీ, ఆర్ధిక, హైటెక్ రంగాల్లోనూ బ్లాక్ చెయిన్ సాంకేతికతను అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోని అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌కు ఆడిట్ లావాదేవీల నిర్వహణకు -
విప్రో, టెక్ మహీంద్రాలో ఎమ్మెల్యేల బృందం
విశాఖ : విశాఖలోని విప్రో, టెక్ మహీంద్రా సంస్థలను నలుగురు ఎమ్మెల్యేల బృందం మంగళవారం సందర్శించింది. ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్ రాజు, గణేష్ కుమార్, పల్లా శ్రీనివాస్ ...రెండు సంస్థలను సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల కప్పనలో విప్రో సంస్థ విఫలమైందని ఆరోపించారు. ఇప్పుడు ఎస్ఈజెడ్లో వర్తింపచేయాలని కోరటం విడ్డూరంగా ఉందన్నారు. అయిదేళ్లలో రెండువేల మందికి ఉద్యోగాలు ఇస్తామన్న విప్రో... ఏడేళ్లు అవుతున్నా ఇప్పటికి 600మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయిందన్నారు.