సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం వాడీవేడిగా సాగుతోంది. 37వ రోజైన గురువారం కూడా జిల్లాలోని అన్నివర్గాలు ఐక్యంగా గొంతెత్తి సమైక్య గర్జన చేశారుు. జిల్లాలోని ఉపాధ్యాయులంతా గురు పూజోత్సవాలకు దూరంగా ఉండిపోయూరు.
ఏలూరు, న్యూస్‌లై న్:
సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం వాడీవేడిగా సాగుతోంది. 37వ రోజైన గురువారం కూడా జిల్లాలోని అన్నివర్గాలు ఐక్యంగా గొంతెత్తి సమైక్య గర్జన చేశారుు. జిల్లాలోని ఉపాధ్యాయులంతా గురు పూజోత్సవాలకు దూరంగా ఉండిపోయూరు. తమకు స్ఫూర్తిప్రదాత అరుున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు.. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రతినబూనారు. ఏలూరు నగరంలోని ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ఉపాధ్యాయులు ఇందిరాగాంధీ, సోనియా, చిరంజీవి, కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, పురందేశ్వరి మాస్క్‌లు ధరించి విభజన ప్రకటనపై నిరసన వ్యక్తం చేశారు. నాటిక ద్వారా సమైక్యాంధ్ర ఆవశ్యకతను చాటిచెప్పారు. జిల్లాస్థారుు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు పురస్కారాలను తీసుకోకుండా జెడ్పీ కార్యాలయం వద్ద రిలే దీక్ష చేపట్టారు. తాడేపల్లిగూడెంలో 1,600 మంది ప్రైవేట్, ప్రభుత్వ ఉపాధ్యాయులు రోడ్డుపై కిలోమీటరుకు పైగా టెంట్లు వేసి ‘గురువుల మహాదీక్ష’ చేపట్టారు. శ్వేత వస్త్రాలు ధరించి, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని విభజన నిర్ణయంపై నిరసన తెలిపారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు గురువులకు బాసటగా నిలిచారు.
జనమంతా ఉద్యమ బాటలోనే...
ఏలూరు నగరంలో గురువారం నిర్వహించిన లక్ష గళార్చన శంఖారావంలో వేలాదిమంది ప్రజలు పాల్గొని సమైక్య నినాదాన్ని మారుమోగించారు. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు రోడ్డుపై గురుపూజోత్సవం నిర్వహించారు. పాలకొల్లు పట్టణంలో మునిసిపల్ ఉద్యోగులు నగర సంకీర్తన చేశారు. పెనుగొండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. పోడూరు మండలం వేడంగి, యలమంచిలి మండ లం దొడ్డిపట్ల, కాంభొట్లపాలెం, శిరగాలపల్లి, చించినాడ గ్రామాల్లోనూ వంటావార్పు చేసి నిరసన గళమెత్తారు. పెనుగొండ బంద్ విజయవంతమైంది. చింతలపూడిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సీమాంధ్ర మంత్రులు, సోనియా, చంద్రబాబు చిత్రపటాలను గాడిదలకు కట్టి ఊరేగించారు. కొయ్యలగూడెంలో పట్టభద్రులు పండ్లు, కూరగాయలు విక్రరుుంచి నిరసన తెలిపారు. తణుకులో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు రిలే దీక్ష చేయగా, న్యాయవాదులు గంగిరెద్దు కళాకారుల వేషధారణలతో విభజన ప్రకటనపై నిరసన వ్యక్తం చేశారు. వైద్యులు, ఉపాధ్యాయులు ర్యాలీలు, మానవహారాలు చే శారు.
అత్తిలిలో మహిళలు ర్యాలీ చేశారు. కొవ్వూరు ఏబీఎన్ అండ్ పీఆర్‌ఆర్ కళాశాల విద్యార్థులు మెరకవీధిలోని రాష్ట్ర రహదారిపై మానవహారంగా ఏర్పడి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తాళ్లపూడి మండల ఉపాధ్యాయులు టీచర్స్ డేను బహిష్కరించి దీక్షలు నిర్వహించారు. కొవ్వూరు మండలం నందమూరులో వంటావార్పు జరిగింది. చింతలపూడి లో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రదర్శన, మానవహారం, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కామవరపుకోటలో ఉపాధ్యాయులు రోడ్డుపైనే విద్యార్థులకు పాఠాలు బోధించారు. బుట్టాయగూడెం సెంటర్‌లో మహిళలు కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. టి.నరసాపురంలో ఉపాధ్యాయులు చేపట్టిన 48 గంటల మేలుకొలుపు దీక్ష గురువారం ముగిసింది.
వైఎస్ జగన్ స్ఫూర్తితో...
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో ఆ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారుు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, కాగడాల ప్రదర్శనలు, రిలే నిరాహార దీక్షలు వంటి కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించారు. ప్రజలు, ఉద్యోగ సంఘాలు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాలను ఆ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, పార్టీ సీఈసీ సభ్యులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు సందర్శించి సంఘీభావం తెలిపారు.