కేసీఆర్ గద్వాల సభ ప్లాప్ షో | Telangana congress MLCs take on K chandrasekhar rao | Sakshi
Sakshi News home page

కేసీఆర్ గద్వాల సభ ప్లాప్ షో

Published Fri, Mar 7 2014 3:51 PM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM

కేసీఆర్ గద్వాల సభ ప్లాప్ షో - Sakshi

కేసీఆర్ గద్వాల సభ ప్లాప్ షో

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభ ప్లాప్ షో అని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు విమర్శించారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఆయన ప్రజలకు చేసింది ఏమి లేదని ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఆర్డీఎస్ కోసం కేసీఆర్ ఏనాడు పోరాడలేదని, ఆయన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో తమ వంతు పాత్ర పోషించాలని ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు నిర్ణయించారు. 1990 నుంచి వివిధ ప్రభుత్వాలు జరిపిన భూ కేటాయింపులను గవర్నర్ సమీక్షించాలని కోరారు. భూ అవకతవకలకు బాధ్యులైన వారిని జైలుకు పంపాల్సిందేనని డిమాండ్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పూర్తిగా సహకరించారని, చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వ్యవహారిచలేదని టి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement