పరిహారంలో వివక్ష సహించం | telangana formers are treating as lowclass | Sakshi
Sakshi News home page

పరిహారంలో వివక్ష సహించం

Published Mon, Oct 28 2013 1:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

telangana formers are treating as lowclass

తూప్రాన్, న్యూస్‌లైన్: తుపాను కారణంగా సీమాంధ్రలో పంటనష్టం జరిగితే వెంటనే అక్కడ పర్యటించిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబులకు తెలంగాణలోని రైతుల పంట నష్టం కనిపించలేదా అని సిద్దిపేట ఎమ్మెల్యే  హరీష్‌రావు ప్రశ్నించారు. అల్పపీడనం కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన సూచన మేరకు తెలంగాణలోని పది జిల్లాల్లో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకుని వారికి పార్టీ తరఫున కొంత ఆర్థిక సహయం అందిస్తున్నాట్లు హరీష్‌రావు తెలిపారు.
 
 ఈ పర్యటనలో హరీష్‌రావు వెంట కోరుట్ల ఎమ్మెల్యే విద్యసాగర్‌రావు, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, పాతూరి సుధాకర్‌రెడ్డి, మహ్మద్‌అలీ, మాజీ ఎమ్మెల్యేలు, పద్మాదేదేందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రోల్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ముందుగా వారు తూప్రాన్ మండలంలోని దండుపల్లి, మనోహరాబాద్, వెంకటాయిపల్లి గ్రామాల్లో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి ఆర్థిక సహయం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ వానలతో రైతులు నష్టపోతే కిరణ్‌కు, చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు గుర్తుకు రాకపోవడం దారుణమన్నారు.
 
 కోస్తాంధ్ర ప్రజలపై మమకారం చూపి, తెలంగాణ ప్రజలపై వివక్ష చూపడం దారుణమన్నారు. కోస్తాంధ్రలో కొబ్బరిచెట్లు పడిపోతే నష్టపరిహారం పెంచేందుకు కృషిచేస్తానని చెప్పిన సీఎం తెలంగాణ రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటలు మొలకెత్తితే  మాట్లాడడం లేదన్నారు. మూడేళ్ల క్రితం వడగండ్ల వానలతో మెదక్ జిల్లాలో పంట నష్టం జరిగితే ఇప్పటికీ పరిహారం అందించలేదన్నారు. అదే కోస్తాంధ్రలో నీలం తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు రూ.వెయ్యికోట్ల నష్టపరిహారం అందించారన్నారు.  తెలంగాణ లో ఒక్క పైసా కూడా చెల్లించలేదని దుయ్యబట్టారు. ఆంధ్రలో క్రాప్ హాలీడే ప్రకటిస్తే నష్టపరిహరం అందించడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎలక్షన్‌రెడ్డి, మాదాసు శ్రీనివాస్, సురేశ్‌కుమార్, భూంరెడ్డి, శేఖర్‌గౌడ్, కొండల్‌రెడ్డి, శ్రీశైలంగౌడ్, భూంలింగాగౌడ్, మన్నెశ్రీనివాస్, రమేశ్‌గౌడ్, మంగ్యానాయక్, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 ఆర్ధిక సహయం అందజేత
 వర్షంతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన టీఆర్‌ఎస్ బృంద సభ్యులు దండుపల్లిలో రోడ్డుపై మొక్కజొన్నలను ఆరబోసిన వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన అనంతరం 10 ఎకరాలను కౌలు తీసుకొని పంట నష్టపోయిన నిమ్మలరాణికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు రూ.3వేల ఆర్థిక సహయం అందజేశారు. మనోహరాబాద్ శివారులో వరిపంటను పరిశీలించిన అనంతరం రైతు కేశబోయిన భూమమ్మకు రూ.5 వేలు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ అందజేశారు, వెంకటాయిపల్లిలో నీటమునిగిన వరి, కూరగాయల పంటలను పరిశీలించి రైతు తీగుళ్ల ఉర్మిళకు రూ.5వేలను మాజీ ఎమ్మెల్యే పద్మాదేదేందర్‌రెడ్డి అందించగా అదే గ్రామానికి చెందిన చాకలి మల్లమ్మకు చెందిన ఇల్లు కూలడంతో రూ.5వేల ఆర్థిక సహాయాన్ని హరీహ్‌రావు అందజేశారు.
 
 ప్రభుత్వమే ఆదుకోవాలి
 చేగుంట, న్యూస్‌లైన్: వర్షంతో నష్టపోయిన రైతుల బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదని ిఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు  పంట నష్టం పరిశీలనలో భాగంగా ఆదివారం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ల బృందం  చేగుంట, కర్నాల్‌పల్లి, రాంపూర్, గొల్లపల్లిలోని పొలాలను పరిశీలించింది. చేగుంట బైపాస్ వద్ద మొలకెత్తిన మొక్కజొన్నలను పరిశీలించిన హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు  స్థానిక రైతులను పట్టించుకోకపోవడం ఎంత వరకు సమంజసమన్నారు.  కర్నాల్‌పల్లికి చెందిన కౌలు రైతులు నర్సయ్య, పెంటమ్మ లక్షరూపాయల పెట్టుబడితో 6 ఎకరాల మొక్కజొన్న వేయగా మొలకెత్తి తాము తీవ్రంగా నష్టపోయామని రోదిస్తు తెలిపారు. రాష్ర్త నాయకులు కొత్త ప్రభకర్‌రెడ్డి నష్టపోయిన రైతులకు తనవంతుగా అర్థిక సాయం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement