అక్బరుద్దీన్ను అడ్డుకున్న తెలంగాణవాదులు | Telangana supporters protest Akbaruddin Owaisi | Sakshi
Sakshi News home page

అక్బరుద్దీన్ను అడ్డుకున్న తెలంగాణవాదులు

Published Thu, Dec 5 2013 1:16 PM | Last Updated on Sat, Aug 11 2018 7:54 PM

అక్బరుద్దీన్ను అడ్డుకున్న తెలంగాణవాదులు - Sakshi

అక్బరుద్దీన్ను అడ్డుకున్న తెలంగాణవాదులు

మహబూబ్‌నగర్ : చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి తెలంగాణ సెగ తగిలింది. గురువారం ఆయనను తెలంగాణ వాదులు కొత్తూరు మండలం జేపీ దర్గా వద్ద అడ్డుకున్నారు. అక్బరుద్దీన్ కారుపై రాళ్లతో దాడి చేశారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నేడు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

 కాగా  దర్గా సందర్శనకు వచ్చిన అక్బరుద్దీన్ ను తెలంగాణవాదులు అడ్డుకుని, వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన వాహనంపై రాళ్లు రువ్వటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, భద్రత నడుమ అక్బరుద్దీన్ ను హైదరాబాద్ పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement