మద్ది అంజన్న సేవలో బుల్లితెర నటులు | telugu Television actors Visited to Anjaneya Swamy Temple | Sakshi
Sakshi News home page

మద్ది అంజన్న సేవలో బుల్లితెర నటులు

Published Sat, Nov 4 2017 3:59 PM | Last Updated on Sat, Nov 4 2017 3:59 PM

telugu Television actors Visited to Anjaneya Swamy Temple - Sakshi

జంగారెడ్డిగూడెం రూరల్‌: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్లితెర నటులు దర్శించుకున్నారు. శతమానం భవతి సీరియల్, కల్యాణ వైభోగమే తెలుగు ధారావాహికలో నటిస్తున్న శ్రీరామ్, ప్రముఖ నటి మేఘనలు శుక్రవారం దర్శించుకున్నారు. పాపికొండల పరివాహక ప్రాంతంలో జరుగుతున్న కల్యాణ వైభోగమే సీరియల్‌ చిత్రీకరణకు వచ్చిన వారు అంజన్నను దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామి ప్రసాదాలు అందజేశారు. అర్చకులు ఆశ్వీరచనాలు అందించారు. 

స్వామిని దర్శించుకున్న ఆర్డీఓ
స్వామి వారిని కొత్తగా బాధ్యతలు చేపట్టిన జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె.మోహన్‌ కుమార్‌ దర్శించుకున్నారు. ఆర్డీఓకు ఆలయ చైర్మన్‌ యిందుకూరి రంగరాజు, కార్యనిర్వాహణాధికారి పెన్మెత్స విశ్వనాధరాజులు శేషవస్త్రాన్ని కప్పి సత్కరించారు. స్వామి వారిచిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు.

నేడు తమలపాకుల పూజ
కార్తీకమాసం మూడో శనివారం కావడంతో స్వామికి లక్ష తమలపాకులతో పూజ చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. తొలుత స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం అనంతరం తమలపాకుల పూజ చేస్తామని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement