
సాక్షి, చిత్తూరు: తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల మోసానికి స్థానికులు రోడ్డుపాలయ్యారు. డబ్బులు తీసుకుని టీడీపీ నేతల ఇప్పించిన భూముల్లో స్థానికులు కొందరు నిర్మాణాలు చేసుకున్నారు. అయితే అవి అక్రమ నిర్మాణాలని అధికారులు తొలగించే ప్రయత్నం చేయడంతో వారిని స్థానికులు అడ్డుకున్నారు. ఓ దశలో పోలీసులకు, వారికీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినా తగ్గని అధికారులు...పోలీసుల సాయంతో నిర్మాణాలను కూల్చివేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై...ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment