కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గ్రామ ఉప సర్పంచి ఆలోకం కృష్ణారావు హత్య కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్లో బుధవారం వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కంచికచర్ల రూరల్ సీఐ ఎం.రామ్‌కుమార్ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను మీడియాకు వెల్లడించారు. కృష్ణారావును హత్య చేసేందుకు, అక్కారావు ఇంటిపై దాడి చేసేందుకు అదే గ్రామానికి చెందిన చాగంటి సీతారామయ్య రూ.2 వేలు ఆర్థిక సాయం చేసి ప్రోత్సహించారని చెప్పారు.
ఆ డబ్బుతో మద్యం తాగిన నిందితులు, ఆదివారం ఉదయం నుంచి గ్రామంలో యర్రంరెడ్డి సీతయ్య దంపతులతో పాటు గుదే సెల్వరాజు, తాటుకూరి సావిత్రిపై దాడులకు పాల్పడి గాయపరిచారని తెలిపారు. రాత్రి 12 గంటల సమయంలో నిందితులు వడ్డె త్రివిక్రమ్‌రావు, కంచె రమేష్‌బాబు, పాతూరి వెంకటేశ్వరరావు, సామినేని గోపి, చాగంటి రాజేష్, చింతల కోటేశ్వరరావులు కలిసి కృష్ణారావును హత్య చేసినట్లు తెలిపారు. నిందితులు నందిగామ బస్టాండ్‌లో ఉండగా ఈనెల 12న అరెస్టు చేశామన్నారు. హత్య కేసుకు సంబంధించి వారిని నందిగామ కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. కానీ, నిందితులు మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపై దాడిచేసిన కేసును ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు.
వైసీపీ నేత హత్య కేసులో నిందితుల అరెస్టు
Published Thu, Aug 14 2014 1:32 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement