ప్రమాద వశాత్తు ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
ప్రమాద వశాత్తు ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. వైఎస్సార్‌జిల్లా వల్లూరు మండలం పుల్లారెడ్డిపేట ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం చంద్రశేఖర్ (9) రోడ్డు పక్కనే ఉన్న ఇంటి ముందు స్నానాల గదిలో ఉండగా... ట్రాక్టర్ గోడను వచ్చి ఢీకొంది. ఆ రాళ్లు చంద్రశేఖర్‌పై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కర్నూలుకు తీసుకెళుతుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు.