మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయే దశలో దస్తావేజు లేఖరులను రోడ్డున పడేసే నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తగదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. రిజిస్ట్రేషన్ సేవలను మీసేవకు బదలాయించి, దస్తావేజు లేఖరుల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు పూనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు చేపట్టిన విధుల బహిష్కరణ కార్యక్రమం శనివారానికి మూడో రోజుకు చేరుకుంది. రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
రిజిస్ట్రార్ కార్యాలయ గేట్లను మూసివేసి నిరసన తెలుపుతుండడంతో మూడు రోజులుగా కార్యకలాపాలకు త్రీవ అంతరాయం ఏర్పడింది. నిరసనకు పేర్ని మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ 2014 జనవరి 24వ తేదీన నేటి రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంద ని చెప్పారు. ప్రభుత్వం ఆవసాన దశలో ఉన్నా... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు, దస్తావేజు లేఖరులను బజారున పడేసేందుకు నిర్ణయం తీసుకోవడం విచారకరమన్నారు. రిజిస్ట్రేషన్ సేవలను మీ సేవ కేంద్రాలకు బదలాయించాలని నిర్ణయం తీసుకోవడం తగదని తెలిపారు.
మున్సిపల్ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ షేక్ సలార్‌దాదా మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ విధానం కారణంగా జీవనోపాధికోసం పని చేస్తున్న దస్తావేజు లేకరులు రోడ్డున పడనున్నారన్నారు. ధర్నా శిబిరాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి మద్దతు తెలిపారు. ధర్నాలో దస్తావేజు లే ఖరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జంపాన రవిశంకర్, ఉపాధ్యక్షుడు నరహరిశెట్టి తుకారం, వెంట్రప్రగడ వేణుగోపాలరావు, కార్యదర్శి వాడపల్లి బాలాజీసువర్ణకుమార్, సభ్యులు సర్ధార్ రహీమ్, మేకా శ్రీను, బోయిన దుర్గాప్రసాద్, నున్నా ఇందుప్రసాద్, దొంతు వెంకటేశ్వర్లు పలువురు దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు.
కూలిపోయే ప్రభుత్వమిది : పేర్ని
Published Sun, Dec 29 2013 1:17 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement