నెల్లూరు సిటీ,న్యూస్‌లైన్ : జిల్లాలోని రవాణా శాఖకు సీజింగ్ యార్డు లేకపోవడంతో ఆ శాఖ అధికారులకు తిప్పలు తప్పడం లేదు. వాహన యజమానులు సైతం తమ వాహనాలు తుప్పు పడుతున్నాయని వాపోతున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కార్యాలయం, ప్రాంతీయ రవాణా శాఖాధికారి కార్యాలయం జిల్లా కేంద్రంలోని భక్తవత్సలనగర్‌లో ఉన్నాయి. నిత్యం వెయ్యి నుంచి 1500 మంది వాహన యజమానులు వివిధ రకాల సేవ లు పొందుతుంటారు. ఈ కార్యాలయ ప్రాంగణంలోనే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ తనిఖీ లు, వాహన ఫిట్‌నెస్ సంబంధించిన తనిఖీలు, డ్రైవర్ లెసైన్సు మంజూరుకు అవసరమైన తని ఖీలు నిర్వహిస్తుంటారు.
డ్రైవింగ్ లెసైన్స్ తని ఖీలకు అవసరమైన టెస్ట్ ట్రాక్ ఉన్నప్పటికీ తనిఖీ అధికారి, సిబ్బంది ఉండేందుకు అవసరమైన గది లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నూతనంగా రిజిస్ట్రేషన్ కోసం ఎఫ్‌సీల కోసం నిత్యం వందలాది వాహనాలు కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అయితే కార్యాలయ ఆవరణలో, సమీప ప్రాంతాల్లో సీజింగ్ వాహనాలు నిలిపి ఉండటంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే వాహనాలను నిలిపేందుకు చోటు దొరకడం కష్టమవుతుంది. ఫిట్‌నెస్ కోసం మినీబైపాస్ రోడ్డులోనే వాహనాలను నిలపి వేయాల్సి వస్తోంది. సంబంధిత మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ అక్కడి వరకు వెళ్లి ఎఫ్‌సీలను జారీ చేయాల్సి ఉంటుంది. రోడ్డుపైనే ఎఫ్‌సీ తనిఖీలు నిర్వహించడంతో పైరవీలకు అవకాశమేర్పడుతుంది. జిల్లా వ్యాప్తంగా అక్రమ వాహనాలను ఎక్కడ పట్టుకున్నా రవాణా శాఖకు చెందిన సీజింగ్ యార్డులు ఉంచితే సంబంధిత వాహన యజమాని అపరాధ రుసుం, ఆలస్య రుసుం చెల్లించిన తర్వాత రిలీజింగ్ ఆర్డర్ ఇస్తే సంబంధిత సీజింగ్ యార్డులోని సెక్యూరిటీ విభాగానికి రిలీజింగ్ ఆర్డర్ కాపీ ఇచ్చి వాహనాన్ని తీసుకు వెళ్లవచ్చు.
జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వివిధ ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించిన ఎంవీఐలు అక్రమ వాహనాలను పట్టుకుంటే వాటిని భద్రపరిచేందుకు అవస్థలు పడుతున్నారు. సమీపంలోని ఆర్‌టీసీ డిపోల్లో ఉం చేందుకు సంబంధిత అధికారులు అంగీకరించడం లేదు. ఇక కొన్ని పోలీస్ స్టేషన్లలో అయితే రవాణా శాఖ అధికారులు పట్టుకున్న వాహనాలను ఇక్కడ ఉంచుకోబోమని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. సుదూర ప్రాంతంలో సీజ్ చేసిన వాహనాన్ని సైతం సంబంధిత ఎంవీఐ సొంత పూచికత్తుపై సురక్షిత ప్రదేశంలో ఉంచాల్సి ఉం టుంది. దీంతో సంబంధిత ఎంవీఐ తన వద్ద ఉన్న ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌ను కానీ హోంగార్డును గాని వాహనంతో పాటు పంపి జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలోనే ఉం చాల్సి రావడంతో అధికారులు ఎక్కువ వాహనాలను తనిఖీ చేయలేక పోతున్నారు. శివారు ప్రాం తంలో ఒక ఎకరా స్థలం ప్రభుత్వం వద్ద నుంచి సేకరించుకుని చుట్టూ ప్రహరీ నిర్మించుకుంటే అధికారులకు ఇబ్బంది లేకుండా ఉండడమే కాకుండా వాహనాలకు భద్రత లభిస్తుందని పలువురు భావిస్తున్నారు.
రవాణా శాఖను వేధిస్తున్న యార్డు కొరత
Published Mon, Dec 9 2013 5:07 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement