మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పడిన ఈ వర్షాలు పంటలకు మేలు చేస్తాయని రైతులు, వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పశ్చిమకృష్ణాలో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా పెనుగంచిప్రోలులో 91.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 16.9 మిల్లీమీటర్లుగా నమోదైంది. పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు వద్ద కూచివాగు, దూళ్లవాగు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో దాదాపు 200 ఎకరాల్లో వరి నీటమునిగింది. పశ్చిమకృష్ణా పరిధిలోని మండలాల్లో పత్తి మొగ్గ తొడిగే దశలో ఉందని, ఈ వర్షంతో పత్తి మొక్కలకు మేలు కలుగుతుందని రైతులు చెబుతున్నారు.
వర్షపాతం వివరాలివీ..
జగ్గయ్యపేటలో 53, వత్సవాయి 33.2, నందిగామ 40.8, కంచికచర్ల 29.4, చందర్లపాడు 10.4, వీరులపాడు 23.2, ఇబ్రహీంపట్నం 17.4, జి.కొండూరు 24.2, ఎ.కొండూరు 20, మైలవరం 17, గంపలగూడెం 45.6, తిరువూరు 38.4, విస్సన్నపేట 8.8, రెడ్డిగూడెం 10, విజయవాడ రూరల్, అర్బన్ 7.8, పెనమలూరు 18.2, కంకిపాడు 13.2, గన్నవరం 13.2, ఆగిరిపల్లి 8.8, చాట్రాయి 21, ముసునూరు 50.2, బాపులపాడు 29.6, ఉంగుటూరు 56.2, ఉయ్యూరు 3.8, పమిడిముక్కల 7.6, మొవ్వ 26, ఘంటసాల 11, చల్లపల్లి 0.8, మచిలీపట్నం 5, గూడూరు 13.8, పామర్రు 5.2, పెదపారుపూడి 5.4, నందివాడ 18, గుడివాడ 4.6, గుడ్లవల్లేరు 11.6, పెడన 4, బంటుమిల్లి 4.6, ముదినేపల్లి 8.2, మండవల్లి 8.4, కైకలూరు 8.2, కలిదిండి 6.2, కృత్తివెన్నులో 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాలువ శివారున ఉన్న ప్రాంతాల్లో వర్షం సక్రమంగా ఆశించిన స్థాయిలో కురవకపోవటంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. వర్షం కురిస్తే వరిపైరు పెరుగుదలకు అవకాశం ఉండేదని రైతులు చెబుతున్నారు.
అత్యధిక వర్షపాతం
Published Mon, Sep 9 2013 12:53 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement