ఆదోని: మానవ హక్కుల వేదిక(హెచ్.ఆర్.ఎఫ్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల కార్యదర్శిగా న్యాయవాది యు.జి. శ్రీనివాసులు ఉన్నారు. ఈయనపై గత కొన్నాళ్లుగాపోలీసులు చేస్తున్న వేధింపు చర్యలను మానవ హక్కుల సంఘం ఖండించింది. గత ముడు సంవత్సరాల నుంచి శ్రీనివాసల పైనే కాక, ఆదోనిలో అనేక మంది కార్యకర్తలపై కూడా పోలీసులు అనేక తప్పుడు క్రిమినల్ కేసులు బనాయించారు. పోలీసులు చేస్తున్నఅక్రమ, దుందుడుకు చర్యలను శ్రీనివాసుల నాయకత్వంలో మానవ హక్కుల వేదిక విమర్శిస్తుంది.
అంతేకాక శ్రీనివాసులు కర్నూల్ జిల్లాలో ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని చేస్తున్న పరిశ్రమలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఆయన చేపట్టిన కార్యక్రమాలన్నీ అహింసాయుతామైనవే, పారదర్శకత, ప్రజాస్వామిక విలువలతో కూడుకున్నవని మానవ హక్కుల వేధిక పేర్కొనింది. శ్రీనివాసలు చేపట్టే న్యాయసమ్మతమైన కార్యక్రమాలు పోలీసులకు కంటిగింపయ్యాయి. అందుచేతనే ఆయన పై పోలీసలు బూటకపు కేసులు నమోదు చేశారని హెచ్.ఆర్.ఎఫ్ చెప్పింది. పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ గాలినీ, భూమినీ, నీటినీ పరిశ్రమలు కాలుష్యం చేస్తున్నాయి. ప్రజల జీవితాలతో చెలగాటమాడే పరిశ్రమలపై చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిందిపోయి పోలీసులు హెచ్.ఆర్.ఎఫ్ కార్యకర్తలపై ఎస్.సి, ఎస్.టి(అత్యాచార నిరోధక) చట్టం కింద అబద్దపు కేసులు నమోదు చేశారని వివరించింది. పోలీసులు దాదాపుగా 460 మందిపై రౌడీ షీట్లు తెరిచే సరికి ఆ విషయాన్నీ శ్రీనివాసులు ప్రశ్నించారు.
ఈ విధంగా ప్రశ్నించినందుకు పోలీసులు ఆయనపై కూడా రౌడీ షీటు తెరిచారు. శ్రీనివాసులపై ఐ.పి.సి సెక్షన్ 153ఏ భిన్న మతస్తుల మధ్య వైషమ్యాలు పెంచే నేరం కింద కేసు నమోదు చేశారు. ఒక హక్కుల కార్యకర్తపై ఈ సెక్షన్ కింద తప్పుడు కేసు నమోదు కావడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బహుశా ఇదే మొదటి సారేమో అని హెచ్.ఆర్.ఎఫ్ తెలిపింది. నిరసన తెలిపే హక్కును హరిస్తుంటే మేము చూస్తూ ఉండబోమని తెలిపింది. పోలీసులు రాజకీయ ప్రభుత్వ కన్నుసన్నలలోనే నడుస్తున్నారనింది. చట్టబద్ధ, చట్టవ్యతికేక కార్యక్రమాలకు పోలీసుల పాల్పడుతున్నారని వివరించింది. పోలీసుల అధికార దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి వారి చర్యలకు కళ్ళెం వేయాలని హెచ్.ఆర్.ఎఫ్ కోరింది. యు.జి. శ్రీనివాసులపై బనాయించిన కేసులను ఎత్తివేయాలని మానవ హక్కుల వేధిక డిమాండ్ చేసింది.
బనాయించిన కేసులను ఎత్తివేయాలి..
Published Thu, Apr 6 2017 6:40 PM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM
Advertisement