ఆంధ్ర-మహారాష్ట్ర మధ్య ప్రవహిస్తున్న మంజీర నది సరిహద్దు వివాదం పరిష్కారం అటకెక్కింది. ఏళ్లుగడిచినా వివాదం సమసిపోవడం లేదు. ఇసుక క్వారీలు ప్రారంభం కాగానే మన జిల్లా రెవెన్యూ యంత్రాంగం హడావుడి చేసి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా అధికారులతో సంప్రదింపులు జరుపడం, ఆ తర్వాత సర్వే కోసం వెళ్లడం, అక్కడి అధికారులు సహకరించకపోవడం ఆనవాయితీగా మారింది. తాజాగా మహారాష్ట్ర మళ్లీ ఇసుక క్వారీల వేలం పాటలు పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
బోధన్, న్యూస్‌లైన్:
మహారాష్ట్ర అధికారులు సహకరించనందున మంజీర నది సరిహద్దు ఉమ్మడి సర్వే ముందుకు సాగ డం లేదంటూ మన జిల్లా అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. రెండుమూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఇసుకను కొల్లగొట్టేందుకే మహారాష్ట్ర ప్ర భుత్వం సరిహద్దు వివాదం తేల్చుకోవడంలో నాన్చు డు ధోరణి అవలంబిస్తోందనే ఆరోపణలున్నాయి. రెం డేళ్ల క్రితం జిల్లా రెవెన్యూ అధికారులు మంజీర సరి హద్దు సర్వేకు వెళ్లగా మహారాష్ట్ర అధికారులు, కాంట్రాక్టర్లు ఆ ప్రాంత గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి మన అధికారులపై ఉసిగొల్పారు. దీంతో వారు తిరుగుముఖ పట్టాల్సి వచ్చింది.
మహా సర్కారు సాచివేత వైఖరితో ఇసుక క్వారీలు ఆ ప్రభుత్వానికి, కాంట్రాక్టర్లకు సిరులు కురిపిస్తున్నాయి. కళ్ల ముందే మన రాష్ట్ర భూభాగంలోని ఇసుకను కొల్లగొడుతున్నా ఇక్కడి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కళ్లు తెరువడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సరిహద్దు వివాదం తేల్చడం అధికారులతో అయ్యే పనికాదని అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయంగా మన రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మహారాష్ట్ర సర్కారుతో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిం దని జిల్లా సరిహద్దు ప్రజలు అంటున్నారు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో పుట్టిన మంజీర నది బోధన్ రెవెన్యూ డివిజన్‌లోని జుక్కల్ నియోజకవర్గంలోకి మెదక్ జిల్లా మీదు గా ప్రవేశిస్తోంది. బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలలోని మండలాలకు ఆనుకుని పారుతోంది. కోటగిరి, బోధన్ మండలాలకు ఆనుకుని సుమారు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు మధ్య ప్రవహిస్తోంది.
మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి, మంజీర నదులపై ఎగువ భాగంలో అక్రమ ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలు నిర్మించి నీటిని ఒడిసి పడుతూనే మరో వైపు నదీ గర్భంలోని ఇసుకనూ కొల్లగొడుతోంది. విచ్చలవిడిగా వేలం పాటలు నిర్వహించి కాంట్రాక్టర్లకు ఇసుక తవ్వకాలకు అనుమతులిస్తోంది. కాంట్రాక్టర్లు బరితెగించి మన రాష్ట్ర సరిహద్దులోని ఇసుకను తోడేస్తున్నారు. ఈ కథ కొత్తేమీ కాదు. ఏళ్లుగా నడుస్తోంది. సాలూరకు చెందిన రైతులు సరిహద్దు వివాదం తేల్చకుండా ఇసుక లారీలకు మన రాష్ట్రంలో అనుమతి ఇవ్వకూడదని ఆందోళన చేపట్టారు. ఎవరూ స్పందించ లేదు.
ఏటా వేలం పాటలు
బోధన్ మండలం సాలూర శివారులోని మంజీ ర నదికి ఆవలి ఒడ్డున మహారాష్ట్ర ఇసుక క్వారీ లున్నాయి. ఎస్గీ, గంజ్‌గావ్, కార్లా, సగోలి, బోలోగావ్, శావాల, శేల్‌గావ్, మాస్‌నూర్, హున్‌గుందా క్వారీలకు ఐదారేళ్లుగా అక్కడి ప్రభుత్వం వేలం నిర్వహిస్తోంది. కాంట్రాక్టర్లు ఇసుక మేటలను తోడేస్తూ రూ. కోట్లు దండుకుంటున్నారు. అక్కడ ఇసుక లేకపోయినా పోటీ పడి క్వారీలను దక్కించుకుంటున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి పేరుతో మన రాష్ట్ర భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తరలించేందుకు అవకాశం ఉంది. మహారాష్ట్ర సర్కారు నవంబర్, డిసెంబర్‌లలో క్వారీల వేలం పూర్తి చేసి, జనవరి నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతి ఇస్తుంది.
తాజా ఇసుక క్వారీల వేలం పాటలు పూర్తి?
తాజాగా మహా ఇసుక క్వారీల వేలం పాటలు పూర్తి చేసినట్టు సమాచారం. సాలూర వద్ద మంజీర నదికి ఆవలి ఒడ్డున ఉన్న ఎస్గీ, గంజ్‌గావ్, సగ్రోలి, శేల్‌గావ్, శావుల ఇసుక క్వారీల వేలం పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఎస్గీ క్వారీ లో ఇసుక లేకపోయినా కాంట్రాక్టర్లు సుమారు రూ. 3 కోట్లపైనే వేలం పాడి దక్కించుకున్నట్టు తెలిసింది. ఈ క్వారీలను నాందేడ్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అనుచరుల పేరుతో పొందిన ట్టు సమాచారం. గంజ్‌గావ్ క్వారీ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఇసుక కాంట్రాక్టరు దక్కించుకున్నట్టు సమాచారం. కాంట్రాక్ట ర్లు ఇసుక క్వారీల పరిసర ప్రాంతాల్లో రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు.
భూగర్భ జలాలకు మహాముప్పు
మహారాష్ట్ర ఇసుక క్వారీలు బోధన్ మండలంలోని మందర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూ ర, తగెల్లి, కల్దుర్కి, సిద్దాపూర్‌గ్రామాల్లో ఉన్నా యి. మన భూభాగంలోని నదిపై అనేక ఎత్తిపోతల పథకాలు, కరెంట్ బోరుబావులు, తాగు నీటి పథకాలు పని చేస్తున్నాయి. సాలూర వద్ద 1,600 ఎకరాలకు సాగు నీరందిస్తున్న ఎత్తిపోతల పథకం, తగ్గెల్లి వద్ద 13 గ్రామాలకు డీఫ్లోరైడ్ తాగు నీటిని అందిస్తున్న చిన్నమావంది పథకం, నది ఒడ్డున వందల సంఖ్యలో కరెంట్ బోరుబావులున్నాయి. ఇసుక తవ్వకాలతో భూర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం పొంచి ఉంది. మహారాష్ట్ర ఇసుక క్వారీల నుంచి లారీలు సాలూర వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు మీదుగా మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. పరిమితికి మించి భారీ వాహనాలలో ఇసుక రవాణా సాగుతోంది. దీంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి.
అప్రమత్తం కాకపోతే భారీ నష్టమే..
మహారాష్ట్ర ఇసుక క్వారీల ప్రారంభానికి ముందే జిల్లా అధికారులు అప్రమత్తం కావాల్సి న అవసరముంది. ముందస్తుగానే సరిహద్దు వివాదం తేల్చుకునేందుకు చర్యలు చేపట్టాలి. మన రాష్ట్రంలో ఇసుక రవాణాపై ఆంక్షలు పెట్టి మహారాష్ట్ర సర్కారును ఇరుకున పెడితేనే సమస్య పరిష్కారానికి మార్గం లభిస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
తాజా దోపిడీ
Published Wed, Dec 25 2013 3:29 AM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM
Advertisement
Advertisement