చట్టాలు కఠినతరం చేయాలి
రాష్ట్ర మహిళా భద్రతా కమిటీ చైర్మన్ పూనం మాలకొండయ్య
హైదరాబాద్: మహిళలపై వేధింపులు తగ్గాలంటే పోకిరీల పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర మహిళా భద్రతాకమిటీ చైర్మన్, సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య అన్నారు. శుక్రవారం ఆమె నగరంలోని వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థినులతో బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం పూనం మాలకొండయ్య మీడియాతో మాట్లాడుతూ... బస్‌స్టాప్, రైల్వే స్టేషన్లలో పోకిరీల వేధింపులు నిత్యకృత్యంగా మారాయన్నారు. ఆటోవాలాలు, కొన్ని రూట్లలో బస్ కండక్టర్ల ప్రవర్తన అసభ్యకరంగా ఉంటోందన్నారు.
మహిళల రక్షణ కోసం నగరంలో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. వేధింపులకు పాల్పడే వారిని శిక్షించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. మహిళా కళాశాలల వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. నిర్భయ వంటి చట్టాలపై యువకులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. మహిళల భద్రతపై 18వ తేదీలోపు సలహాలు, సూచనలను ఠీఛిఛీటఛ్టిజ2014ఃజఝ్చజీ. ఛిౌఝ కు మెయిల్ చేయాలని సూచించారు.కమిటీ సభ్యులు సౌమ్యామిశ్రా, స్వాతిలక్రా, చారుసిన్హా, శైలజారామయ్యర్ పాల్గొన్నారు.