చిన్న ఆస్పత్రుల అభివృద్ధితో పేదలకు మేలు | The poor to benefit the development of the small hospitals | Sakshi
Sakshi News home page

చిన్న ఆస్పత్రుల అభివృద్ధితో పేదలకు మేలు

Published Mon, Nov 25 2013 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM

The poor to benefit the development of the small hospitals

=చిన్న ఆస్పత్రుల అభివృద్ధితో పేదలకు మేలు
 =ఆప్నా రాష్ట్ర సదస్సులో డీఎంహెచ్‌ఓ సాంబశివరావు

 
ఎంజీఎం, న్యూస్‌లైన్ : అత్యాధునిక వైద్యం ధనవంతులకే అందుతోంది.. చిన్న ఆస్పత్రులను అభివృద్ధి చేసుకోవడం ద్వారా పేద ప్రజ లకు మెరుగైన వైద్యం అందించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివా రం హన్మకొండ పద్మాక్షి కాలనీలోని జయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో నిర్వహించిన 21వ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (ఆప్నా) రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా తెలంగాణ ఉద్యమంలో, రాష్ర్టం కోసం అసువులు బాసిన అమరులకు నివాళులర్పించారు.
 
అనంతరం సాంబశివరావు మాట్లాడుతూ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు సామాజిక దృక్పథంతో సేవలందించినపుడే వైద్య వృత్తిపై ప్రజల్లో గౌరం పెరుగుతుందని చెప్పారు. ఇక్కడికి వచ్చే మారుమూల ప్రాంతాల్లోని గిరిజన, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు ఓపీ విభాగంలో 10 శాతం మేర ఉచితంగా సేవలందించాలని సూచిం చారు. ప్రభుత్వ పరంగా నర్సింగ్ హోమ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. చారిత్మ్రాకమైన వరంగల్ నగరం లో మొట్టమొదటి సారిగా ఆప్నా రాష్ర్ట స్థాయి సదస్సు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అంతకుముం దు ఆప్నా సావనీర్ ఆవిష్కరించారు. అనంతరం భవిష్యత్‌లో చిన్న ఆస్పత్రుల సంరక్షణ కొరకు తీసుకోవాల్సిన కార్యచరణతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్‌పై చర్చించి పలు నిర్ణయా లు తీసుకున్నారు.
 
ఆరోగ్య శ్రీ పథకంలో సవరణలు అవసరం :
నర్సింగరెడ్డి, ఆప్నా రాష్ర్ట అధ్యక్షుడు
 ఆరోగ్యశ్రీ పథకం కార్పొరేట్ ఆస్పత్రులకు వరంగా మారిం దని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా చిన్న చిన్న ఆస్పత్రులకు ఒరిగిందేమీ లేదన్నారు. నిబంధనలు కార్పొరేట్ ఆస్పత్రులకు వర్తించే విధంగా ఉన్నాయని, వాటిని వెంటనే సవరించాలని కోరారు. 20 నుంచి 50 పడకల ఆస్పత్రికి కూడా ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింప చేసినప్పుడే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. ఆరోగ్య శ్రీ ఆస్పత్రులను పట్టణాలకే పరిమితం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు చికిత్స పొందేందుకు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏడు సంవత్సరాల నుంచి అమల వుతున్న ఈ పథకంలోని విధానాల ద్వారా చిన్న ఆస్పత్రులు పెద్ద ఎత్తున మూత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
 
చిన్న ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి : రవీందర్‌రెడ్డి, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు
 మారుమూల ప్రాంతాల ప్రజలతోపాటు పేదలకు అందుబాటులో ఉంటున్న చిన్న చిన్న ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్‌కు ఆరో గ్య శ్రీ పథకాన్ని వర్తింపచేసినపుడే ప్రజలకు లబ్ధిచేకూరుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఖర్చయ్యే వైద్యానికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించడానికి ప్రభుత్వం రూ.లక్ష చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నా రు. నర్సింగ్ హోమ్‌ల అనుమతి విషయంలో ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతోందని, వాటిని తొలగించి సహకరించాలని కోరారు.
 
వైద్యులు సేవాభావంతో మెలగాలి : ప్రొఫెసర్
 సీతారామరాజు, జయ హాస్పిటల్ అడ్వయిజర్
 ప్రభుత్వ వైద్యులతోపాటు ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ వైద్యు లు పేద ప్రజలకు సేవా భావంతో మెరుగైనా వైద్యం అందించాలని సూచించారు. వైద్య వృత్తి అన్ని వృత్తుల్లోకెల్ల గొప్ప ది.. దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు.. వైద్య వృత్తిని కొంత మంది వ్యాపారంగా మారస్తున్నారని అలాం టి విధానాన్ని మానుకుంటే వారిని ప్రజలు దేవుళ్లుగా భావి స్తారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తరువాత అసోసియేషన్ ప్రత్యేక కమిటీని ఎన్నుకుని చిన్న ఆస్పత్రుల తో మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైనా వైద్యం అం దించాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ కౌన్సిల్ సభ్యు డు ఎం.రమేశ్‌రెడ్డి, ఆప్నా జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, వైద్యులు కాంతారెడ్డి, కృష్ణారావు, శ్రీనివాసమూర్తి, కె.అశోక్‌రెడ్డి, కె.రమేశ్‌రెడ్డి, ఇ.రవీందర్‌రెడ్డి, ఐఎంఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంధ్యరాణి, కొత్తగట్టు శ్రీనివాస్, విజయ్‌చందర్‌రెడ్డి, కంకణాల మల్లేశం, బందెల మోహన్‌రావు, కాళీప్రసాద్, మోహన్‌దాస్, కె.ప్రమీల, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement