ఆధునిక వైద్యంతో క్యాన్సర్‌కు చెక్
ఆధునిక వైద్యంతో క్యాన్సర్‌కు చెక్
Published Fri, Dec 9 2016 9:26 PM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM
- కేఎంసీ ప్రిన్సిపాల్ డా. రాంప్రసాద్
- సిల్వర్ జూబ్లీ కాలేజీలో జాతీయ సెమినార్
కర్నూలు సిటీ: ప్రస్తుత సమాజంలో ప్రతి 100 మందిలో 3 నుంచి 10 మంది వరకు క్యాన్సర్ బారిన పడుతున్నారని, ఇలాంటి వ్యాధిని ఆధునిక పద్ధతులతో కొంత మేరకు నయం చేయగలుగుతున్నామని కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.రాంప్రసాద్ అన్నారు. స్థానిక సిల్వర్ జూబీ డిగ్రీ కాలేజీలో వృక్షశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో 'క్యాన్సర్ బయాలజీ' అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్ శుక్రవారం ప్రారంభమైంది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డా.అబ్దుల్ ఖాదర్ అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా.రాంప్రసాద్, ప్రముఖ వక్తలుగా సీసీఎంబీ శాస్త్రవేత్త డా.శ్రీధర్ రావు, సెంటర్ ఫర్ డీఎన్‌ఏ అండ్ ఫింగర్ ప్రింటింగ్ ప్రొఫెసర్ డా.మురళీధరన్ భాష్యం, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ బ్రహ్మానందం, డా.నరేష్ హాజరయ్యారు. కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు మారుతుండడం, చెడు వ్యసనాల వల్ల క్యాన్సర్ సోకుతోందన్నారు. లివర్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, మహిళల్లో గర్భాశాయ, బ్రిస్ట్ క్యాన్సర్లు వేధిస్తున్నాయన్నారు. ప్రతి వంద మందిలో 3 నుంచి 10 మంది వరకు వ్యాధి బారిన పడుతున్నారని తెలిపారు. డాక్టర్.మురళీధర్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జన్యువులో వచ్చే మార్పులు, క్యాన్సర్ కారణాలను వివరించారు. కణ జీవిత చక్రంపై మైటోకాండ్రియాలోని మార్పుల వల్ల క్యాన్సర్ వస్తుందని ప్రొఫెసర్లు డా.బ్రహ్మానందం, డాక్టర్ నరేష్ తెలియజేశారు. అనంతరం పరిశోధన పత్రాల సంపుటిని, ఈ-సావనీర్‌ను ఆవిష్కరించారు. సెమినార్ కార్యవర్గ కార్యదర్శి డాక్టర్.జాన్సన్ సాటురస్, డాక్టర్.మైఖెల్ డేవిడ్, విజయ్‌కూమార్, వెంకటేశ్వరరావు, పార్వతి, సునీత, మాధురి, మాధవీలత, నాగరాజశెట్టి, వెంకటనర్సయ్య, ఉమాదేవి, లలితకూమారి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement