అనుమతి కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ లేఖ
సాక్షి, అమరావతి: మరో రూ.3,000 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో బహిరంగ మార్కెట్ ద్వారా ఈ అప్పు చేసేందుకు అనుమతించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పాదకతలో మూడు శాతం మేర అప్పులు చేసేందుకు వీలుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.15,000 కోట్లు బహిరంగ మార్కెట్ ద్వారా అప్పు చేసింది. ఇక నాల్గో త్రైమాసికంలో (జనవరి నుంచి మార్చి వరకు) రూ.3,000 కోట్లు అప్పు చేయడానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
దీనికి కేంద్రం అనుమతిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో మొత్తం రూ.18 వేల కోట్లు అప్పు చేసినట్లవుతుంది. మరోవైపు ద్రవ్య జవాబు దారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టంలో నిబంధనలను సవరించడం ద్వారా మరింత అప్పు చేసేందుకు వెసులు బాటు కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిబంధనల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పాదకతలో 3 శాతం మేర మేరకే అప్పు చేయడానికి వీలుంది. దీన్ని 3.5 శాతానికి పెంచుతూ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో సవరణలు తీసుకువచ్చేందుకు అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అయితే రెవెన్యూ మిగులు రాష్ట్రాలకు మాత్రమే 3.5 శాతం మేర అప్పునకు కేంద్రం అనుమతించదని, అలాంటిది రెవెన్యూ లోటులో ఉన్న ఏపీకి అనుమతిస్తుందా అన్నది తేలాల్సి ఉంది.
అప్పు తెచ్చుకుంటాం!
Published Mon, Jan 2 2017 2:30 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement
Advertisement