ఎర్రగుంట్ల మండలం ఇండ్ల సిద్ధాయపల్లె-సున్నపురాళ్లపల్లె మార్గంలోని వంకలోని చెలిమ నీరే సురక్షితంగా ఉన్నాయని ఇండ్ల సిద్ధాయపల్లె గ్రామస్తులు తెలిపారు. చెలిమ నీటి రుచి ఆర్‌ఓ ప్లాంట్ల నుంచి వచ్చే నీటిలో ఉండడం లేదని గ్రామస్తులు తెలిపారు.
ఇండ్ల సిద్ధాయపల్లె గ్రామస్తులందరూ చెలిమ నీటిపైనే ఆధారపడుతున్నారు. అవసరాలకు వేరే నీరు ఉపయోగించినా, తాగేందుకు మాత్రం ఈ నీటినే వాడుతున్నామని గ్రామానికి చెందిన వెంకటసుబ్బారెడ్డి అనే వృద్ధుడు తెలిపారు. తనకు ఊహ వచ్చినప్పటి నుంచి ఈ నీటినే తాగుతున్నామని వివరించారు. తమ గ్రామంలోని ప్రతి ఒక్కరూ చెలిమ నీటినే తోడుకుని వెళ్తారని చెప్పారు.
- న్యూస్‌లైన్, ఎర్రగుంట్ల
చెలిమ నీరే సురక్షితం
Published Fri, Feb 21 2014 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM
Advertisement
Advertisement