మార్స్ పైకి వెళ్లిన మనకు సింగపూర్ టెక్నాలజీ కావాలా? | there is no need singapore technology for andhra pradesh, sasy buggana rajenranath reddy | Sakshi
Sakshi News home page

మార్స్ పైకి వెళ్లిన మనకు సింగపూర్ టెక్నాలజీ కావాలా?

Published Mon, Dec 22 2014 6:03 PM | Last Updated on Sat, Jun 2 2018 4:30 PM

మార్స్ పైకి వెళ్లిన మనకు సింగపూర్ టెక్నాలజీ కావాలా? - Sakshi

మార్స్ పైకి వెళ్లిన మనకు సింగపూర్ టెక్నాలజీ కావాలా?

హైదరాబాద్:ఎక్కడైనా రాజధాని లాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టాలంటే అరవై శాతం ప్రజల మద్దతు ఉండాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సీఆర్డీఏ బిల్లు చర్చ సందర్భంగా మాట్లాడిన బుగ్గన.. చట్టాలు జనరల్ గా చేసిన తరువాతే రూల్స్ ఫ్రేమ్ చేస్తారన్ని విషయాన్ని మరోసారి తెలుపుతూనే కీలక అంశాలను లేవనెత్తారు. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 17 శాతం కాగా, భూములు శాతం మాత్రం 2.3గా ఉందన్నారు. మనం మార్స్ ఆర్బిట్ లోకి ప్రవేశించామని.. ఈ పరిస్థితుల్లో సింగపూర్ టెక్నాలజీ కావాలా? అని ప్రశ్నించారు.

 

భూమిని డెవలప్ మెంట్ కు ఇస్తే 70 శాతం భూమి ఓనర్ కు వస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు. ఇక్కడేమో 30 శాతం భూమిని ఎంతో దయతో ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. భూములు ఇవ్వకుంటే ల్యాండ్ ఫూలింగ్ తో బలవంతంగా లాక్కుంటున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే ధరతో సాధారణ ప్రజలు ఎక్కడికి పోవాలన్నారు. ప్రాక్టికల్ గా వర్కవుట్ అయ్యే చోట రాజధాని పెట్టమంటున్నామని బుగ్గన అన్నారు .రాజధానిని ఒకరేమో దొనకొండకు మారస్తామంటారు.. మరి కొందరు జగ్గయ్య పేటకు మారుస్తామంటున్నారని బుగ్గన ఎద్దేవా చేశారు. రాజధానిని ఎక్కడ పెట్టినా తమకు అభ్యంతరం లేదని.. కాకపోతే ఎంత భూమి కావాల అనే అంశంపై స్పష్టత కావాలన్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాజెక్టకు సమీకరిస్తున్న అభ్యంతరాలున్నాయన్నారు. అంత పెద్ద ఎత్తున భూమిని సమీకరించడం భావ్యం కాదని బుగ్గన తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement