మూడోరోజూ ఈదర నిరసన | third day edara haribabu protest | Sakshi
Sakshi News home page

మూడోరోజూ ఈదర నిరసన

Published Sun, Nov 30 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

third day edara haribabu protest

ఒంగోలు: జెడ్పీ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఈదర హరిబాబు చేపట్టిన నిరసన  మూడోరోజైన శనివారం కూడా కొనసాగింది. ఉదయం 11 గంటలకు ఆయన జెడ్పీ కార్యాలయానికి చేరుకోగా   జెడ్పీ చైర్మన్ చాంబర్‌కు, జెడ్పీ సీఈవో చాంబర్‌కు తా ళాలు వేసి కనిపించాయి. దీంతో ఆయన చైర్మన్ చాంబరు ఎదుట ఉన్న మెట్లమీదనే బల్ల, కుర్చీ వేయించుకొని అక్కడే నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆయన ఈ నిరసన కొనసాగించారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా నూకసాని బాలాజీని నియామిస్తూ  జెడ్పీ సీఈవో ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని ఈదర హరిబాబు జెడ్పీ సీఈవో సీసీ సత్యన్నారాయణకు అందజేశారు. ఆయన వద్ద నుంచి కాపీలు తమకు ముట్టినట్లు సంతకం కూడా తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement