Edara haribabu
-
రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలవాలి
ఒంగోలు: జిల్లాలోని జెడ్పీ స్కూళ్లను రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తయారుచేయూలని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు పిలుపునిచ్చారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమీక్షించారు. ప్రహరీ ఉన్న పాఠశాలల్లో నర్సరీ ఏర్పాటుతోపాటు జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్లను కూడా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తరగతి గదులను డిజిటలైజ్ చేయడం, ల్యాబ్, లైబ్రరీ, రక్షిత తాగునీరు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. యోగ, వ్యాయామ విద్యను నేర్పాలన్నారు. రాత్రిపూట సైతం ప్రైవేటు క్లాసుల నిర్వహణకు ఉపాధ్యాయులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాఠశాల ఉన్న గ్రామంలోనే నివాసం ఉండాలని సూచించారు. దీనిపై ఉపాధ్యాయ నేతలు మాట్లాడుతూ కనీసం మండల కేంద్రంలో అయినా ఉండేందుకు అవకాశం కల్పించాలన్నారు. సీనియర్ స్టూడెంట్లకు యోగా నేర్పడం ద్వారా మాత్రమే సక్సెస్ కాగలమని వివరించారు. ప్రతి ఏటా బెస్ట్ స్కూల్స్, బెస్ట్ ప్రధానోపాధ్యాయులను గుర్తించి వారికి అవార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ఈ నెల18 నుంచి ఒంగోలులో నాటకోత్సవాలు
ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలులో జనవరి18వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు జడ్పీ చైర్మన్, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు వెల్లడించారు. గురువారం ఒంగోలులో ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావుతో కలసి హరిబాబు విలేకరులతో మాట్లాడారు. అలాగే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు బాలోత్సవం పేరుతో బాలల నాటికలు ప్రదర్శించనున్నట్లు ఈదర హరిబాబు వివరించారు. ఈ కార్యక్రమాలు స్థానిక పీవీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతాయని ఆయన తెలిపారు. -
అవినీతి రహిత జెడ్పీగా తీర్చిదిద్దుతా
- సమర్ధుడైన అధ్యక్షునిగా పనిచేస్తా - జిల్లాలో టీడీపీ పరిస్థితి బాగాలేదు - విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్మన్ ఈదర ఒంగోలు సబర్బన్ : అవినీతి రహిత జిల్లా పరిషత్గా తీర్చిదిద్దుతానని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ ప్రణాళిక వివరించారు. జెడ్పీలో అవినీతి పేరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రత్యేక ప్రణాళితో ముందుకు వెళ్ళేందుకు సిదంధమైనట్లు వెల్లడించారు. తాను సమర్థుడైన అధ్యక్షునిగా పనిచేసి పేరు నిలబెట్టుకుంటానన్నారు. తాను నిజాయితీగా పనిచేస్తే తన వద్ద పనిచేసే అధికారులు కూడా నిజాయితీగా పనిచేస్తారన్నారు. అందరూ తనకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు. జిల్లా రాజకీయ సంక్షోభంలో ఉందని, దీనివల్ల అభివృద్ధిలో కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఖర్చుచేసే ప్రతి రూపాయికి అకౌంట్‌బిలిటీ ఉండేవిధంగా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపార్టీలో ఉన్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు టీడీపీ నాది...ఆ పార్టీలోనే ఉన్నానని సమాధానమిచ్చారు. మరి పార్టీ అధ్యక్షుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారుకదా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పార్టీని స్థాపించిన అన్న ఎన్‌టిఆర్‌ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, అయితే ప్రస్తుతం ఆయన ఫోటోతోనే పార్టీ నడుస్తుందని గుర్తు చేశారు. జిల్లాలో టీడీపీ పరిస్థితి బాగాలేదని, అయితే పార్టీని బతికించుకుంటానని అన్నారు. అన్ని విషయాలను త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తన ఫోటోలతో ఫ్లెక్సీలు వేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. బొకేలకు, పూలదండలకు కూడా దూరంగా ఉంటున్నానని వివరించారు. తాను తప్పు చేసినా వెనకాడకుండా పత్రికలు, మీడియా క చ్చితంగా వెలుగులోకి తీవాలన్నారు. -
రేపు జెడ్పీఛైర్మన్గా ఈదర హరిబాబు బాధ్యతలు!
-
రేపు జెడ్పీఛైర్మన్గా ఈదర హరిబాబు బాధ్యతలు!
ప్రకాశం: రేపు ఉదయం 10 గంటలకు జెడ్పీఛైర్మన్గా ఈదర హరిబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం అనివార్యమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకూ వైఎస్ ఛైర్మన్ నూకసాని బాలాజీ ఇన్చార్జ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. -
మూడోరోజూ ఈదర నిరసన
ఒంగోలు: జెడ్పీ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఈదర హరిబాబు చేపట్టిన నిరసన మూడోరోజైన శనివారం కూడా కొనసాగింది. ఉదయం 11 గంటలకు ఆయన జెడ్పీ కార్యాలయానికి చేరుకోగా జెడ్పీ చైర్మన్ చాంబర్‌కు, జెడ్పీ సీఈవో చాంబర్‌కు తా ళాలు వేసి కనిపించాయి. దీంతో ఆయన చైర్మన్ చాంబరు ఎదుట ఉన్న మెట్లమీదనే బల్ల, కుర్చీ వేయించుకొని అక్కడే నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆయన ఈ నిరసన కొనసాగించారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా నూకసాని బాలాజీని నియామిస్తూ జెడ్పీ సీఈవో ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని ఈదర హరిబాబు జెడ్పీ సీఈవో సీసీ సత్యన్నారాయణకు అందజేశారు. ఆయన వద్ద నుంచి కాపీలు తమకు ముట్టినట్లు సంతకం కూడా తీసుకున్నారు. -
రోడ్డెక్కిన టీడీపీ విభేదాలు
త్రిపురాంతకం : జిల్లా ఉన్నతాధికారి తన క్లాస్మేట్ అంటారు, నాలుగు క్వార్టర్లు ఇచ్చేవారికి, దళారులకు పనులు చేస్తారు. ఓడిపోయిన వారిని ఇన్‌చార్జీలుగా నియమిస్తే ఇలానే ఉంటుందని టి.డి.పి. యర్రగొండపాలెం ఇన్చార్జిపై ఆ పార్టీ త్రిపురాంతకం ఎంపీపీ నీలం చెన్నమ్మ ధ్వజమెత్తారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. తన మాట పెడచెవిన పెట్టి వేరే వారిని ఎంపీడీవోగా నియమించడంపై మండిపడ్డారు. ఎంపీడీవో బదిలీని నిరసిస్తూ తెలుగుదేశం ఎంపీపీతోపాటు ఆ పార్టీ నాయకులు రోడ్డెక్కారు. మండలపరిషత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీపీ చెన్నమ్మ మాట్లాడుతూ యర్రగొండపాలెం నియోజకవర్గంలో టి.డి.పి. తరుపున పోటీచేసి ఓడిన అజితారావు ఆమె భర్త కోటేశ్వరరావు ఇన్చార్జిని అని చెప్పుకుంటూ పార్టీకి అన్యాయం చేస్తూ పార్టీ కార్యకర్తలకు నష్టం కల్పిస్తున్నారని ఆమె విమర్శించారు. ఓడిపోయిన వారు ఏవిధంగా ఇన్చార్జీలవుతారని ప్రశ్నించారు. 20 వేలతో ఓడిన వారికి విజయం విలువ ఏమి తెలుస్తుందంటూ ఆమె ప్రశ్నించారు. సందకాడ నాలుగు క్వార్టర్లు ఇస్తే పనులు అయిపోతాయి, జిల్లా ఉన్నతాధికారి తన క్లాస్మేట్ అని చెప్పి నియోజకవర్గంలోని అధికారులపై పెత్తనం చేస్తున్నారని తప్పుపట్టారు. దళారులకు ఉన్న విలువ పార్టీ కార్యకర్తలకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు కూడా ఓడిపోయిన నాయకురాలి భర్త చెపితే వినాలా అని ఆమె ప్రశ్నించారు. అజితారావు ఢిల్లీలో ఉంటారు, ఓడిన ఆమె రాదు ... ఆమె భర్త కోటేశ్వరరావు ప్రభుత్వ ఉధ్యోగి అయి ఉండి ఢిల్లీ నుంచి వారానికి ఒక రోజు వచ్చి అధికారులపై పెత్తనం చేయడం ఏమిటని నిలదీశారు. ఒక మహిళా ఎంి.ప.డి.ఓ. కె.అరుణాదేవిని ఇక్కడే కొనసాగించాలని కోరినప్పటికీ ఆమెను బదిలీ చేసి ఆ స్థానంలో అవినీతి పరుడైన మాణిక్యాలరావును నియమించడం ఏమిటని ప్రశ్నించారు. కోప్షన్ సభ్యులు లాజర్ మాట్లాడుతూ మార్కాపురం డివిజన్‌లోనే ఏకైక టి.డి.పి . మండలం త్రిపురాంతకం. ఇక్కడ ఒక ఎస్సి మహిళా ఎం.పి.పి.ని,ఆమె అభిప్రాయాలను గౌరవించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వివరిద్దామని ఒంగోలు వెళ్లాం.. అక్కడ జడ్పికి సి.ఇ.ఓ. ఒక తాళం వేస్తే మరో తాళం ఈదర హరిబాబు వేశారు. -
హైకోర్టు తీర్పు ఇచ్చినా...సహకరించటం లేదు: ఈదర
ఒంగోలు : టీడీపీ బహిష్కృత నేత, ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు గురువారం తన చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. తాను వచ్చేసరికే చాంబర్‌కు తాళాలు వేసి ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే బైఠాయించారు. జెడ్పీ చైర్మన్‌గా కొనసాగాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా సీఈవో సహకరించటం లేదని ఈదర ఆవేదన చెందారు. తనకు న్యాయం జరిగేవరకూ కదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. -
జిల్లాలో బదిలీల సందడి
జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో బదిలీల సందడి నెలకొంది. ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకూ బదిలీలకు సంబంధించి హడావిడిగా గడుపుతున్నారు. ఏ ప్రాంతానికి బదిలీ అవుతామోనని ఉత్కంఠగా ఉన్నారు. శనివారం జిల్లా పంచాయతీ, సహకార శాఖల్లో పలువురు అధికారులు, ఉద్యోగులు బదిలీ అయ్యారు. ఒంగోలు టూటౌన్ : జిల్లా పంచాయతీ కార్యాలయం (డీపీవో)లో బదిలీల సందడి నెలకొంది. బదిలీల ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, అటెండర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో 1,028 పంచాయతీలుండగా, వాటిలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులు బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఉదయం నుంచి మధ్నాహ్నం వరకు జిల్లా పంచాయతీ ఇన్చార్జి అధికారి జి.సుమతికళ, సూపరింటెండెంట్ విజయలక్ష్మిలు ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉద్యోగులు కోరుకున్న చోట ఖాళీ ఉంటే అక్కడికే వారిని బదిలీ చేశారు. ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లు, దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న బిల్లు కలెక్టర్లు, అటెండర్లను బదిలీ చేశారు. బీసీ కేడర్‌లో ఉన్న 9 మంది ఉద్యోగులను ఉన్నచోట నుంచి వేరే పంచాయతీలకు బదిలీ చేశారు. ముగ్గురు అటెండర్లు, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ముగ్గురు శానిటేషన్ మేస్త్రీలను కౌన్సెలింగ్‌లో కోరుకున్న చోటకు బదిలీ చేశారు. మధ్నాహ్నం నుంచి ఈవోఆర్డీలకు కౌన్సెలింగ్ నిర్వహించగా 21 మంది హాజరయ్యారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఖాళీలను సూచించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అనంతరం బదిలీలకు సంబంధించిన ఫైలును కలెక్టర్ అనుమతి కోసం పంపినట్లు జిల్లా ఇన్చార్జి అధికారి సుమతికళ తెలిపారు. ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వజ్రశ్రీ ఆత్మ జిల్లా డిప్యూటీ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వజ్రశ్రీని ప్రభుత్వం నియమించింది. ఈమె విశాఖపట్నం ఉద్యానవనశాఖ డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈమె నియామకాన్ని వ్యవసాయ, సహకార ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపునీతా ఆన్లైన్లో ఉంచారు. తన బదిలీ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ప్రస్తుత ఆత్మ పీడీ బీజీవీ ప్రసాద్ తెలిపారు. తాత్కాలికంగా తెలంగాణ కు బదిలీ ఒంగోలు : ఆర్‌అండ్‌బీలో పనిచేస్తున్న ఆరుగురిని తెలంగాణ ప్రభుత్వంలో ఏడాదిపాటు పనిచేయాలంటూ డిప్యుటేషన్ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి బి.శ్యాంబాబు విడుదల చేశారు. ఈ ఆరుగురిలో ప్రకాశం జిల్లా కనిగిరి పరిధిలో పనిచేస్తున్న ఆర్అండ్బీ ఈఈ జి.లక్ష్మీనారాయణరెడ్డి కూడా ఉన్నారు. డీఆర్డీఏ పీడీ పద్మజ రెవెన్యూకు... డీఆర్డీఏ పీడీగా ఎంఎస్ మురళిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు డీఆర్డీఏ పీడీగా పనిచేసిన పద్మజను ఆమె మాతృ సంస్థ అయిన రెవెన్యూ శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్పీ ఠక్కర్ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒంగోలు: జిల్లా పరిషత్ పరిధిలో పనిచేసే జెడ్పీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే బోధనేతర సిబ్బంది బదిలీల వ్యవహారం భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు శనివారం ప్రారంభించారు. తొలుత జెడ్పీ ఉద్యోగులు నిరాకరించినా ... కొంతమంది కౌన్సెలింగ్‌కు హాజరుకావడంతో తమకు దక్కాల్సిన స్థానాలు వారికి వెళ్లే అవకాశం ఉందని భీష్మించిన ఉద్యోగులు కూడా చివరకు కౌన్సెలింగ్ బాట పట్టారు. ప్రతి విభాగంలోను 20 శాతం మంది అంటే కనీసంగా 300 మందికిపైగా బదిలీలు జరగనున్నాయి. తొలుత ఆగ్రహం జెడ్పీ చైర్మన్‌తోనే కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ కౌన్సెలింగ్‌కు హాజరైన ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు గంటపాటు ఈ ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ కౌన్సెలింగ్ హాలులోకి వెళ్లడం, పోలీసులు వారికి పూర్తిస్థాయి భద్రత కల్పించడంతో కౌన్సెలింగ్‌కు అభ్యంతరం వ్యక్తం చేసిన ఉద్యోగుల్లో కూడా అలజడి ప్రారంభమైంది. ముందుగా వెళ్లిన వారికి కౌన్సెలింగ్‌లో మంచి ప్లేస్‌మెంట్స్ దొరికితే చివరకు మా గతేమిటన్న భయం నెలకుంది. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడి, ఒప్పించి చివరకు తొలుత వ్యతిరేకించిన ఉద్యోగులు కూడా కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. దీంతో జెడ్పీ మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను అధికారులు నిర్విఘ్నంగా కొనసాగించారు. నిలదీత పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఈదర హరిబాబు శనివారం ఉదయం కౌన్సెలింగ్ ప్రారంభించే సమయంలో అక్కడకు చేరుకున్నారు. జెడ్పీ చైర్మన్‌గా తాను ఉన్నపుడు తనకు తెలియకుండా, తనను పిలవకుండా బదిలీలు చేయడం ఏమిటంటూ జెడ్పీ సీఈవో ఎ.ప్రసాద్‌ను ప్రశ్నించారు. జెడ్పీ చైర్మన్ సమక్షంలోనే బదిలీలు చేయాలని జీవో స్పష్టంగా చెబుతున్నప్పటికీ అందుకు విరుద్ధంగా ఇలా చేయడమేమిటని ప్రశ్నించారు. కోర్టు తనకు జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించినా ధిక్కరిస్తున్నారు..రెవెన్యూ అధికారులంతా కలిసి జెడ్పీ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు చెబుతున్నట్లు జడ్పీ చైర్మన్‌గా నూకసాని బాలాజీ సమక్షంలోనైనా బదిలీలు ఎందుకు నిర్వహించడం లేదంటూ కేకలేశారు. కలెక్టర్ ఉత్తర్వులున్నాయి: సీఈఓ కలెక్టర్ ఉత్తర్వులున్నాయని, జెడ్పీ చైర్మన్‌తో సంబంధం లేకుండా కమిటీతో నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో బదులిచ్చారు. అలా అని తనకు రాసివ్వాలని ఈదర కోరగా ప్రస్తుతం కౌన్సెలింగ్‌లో ఉన్న దృష్ట్యా తరువాత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి జెడ్పీ ఛైర్మన్‌గా తాను బాధ్యతలు నిర్వహిస్తున్నానని, ఆ కాగితంపై తనకు ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలంటూ జెడ్పీ సీఈవోని అడగడంతో సంతకం చేసి సీఈఓ ఇవ్వడంతో ఈదర కౌన్సెలింగ్ హాలు నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం జిల్లా అదనపు జేసీ ప్రకాష్‌కుమార్, జెడ్పీ సీఈవో ప్రసాద్, డిప్యూటీ సీఈవో నరశింహారావులు తదుపరి బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభించారు. కౌన్సెలింగ్ నేరమే : బాలాజీ కౌన్సెలింగ్ నిర్వహించడం నేరమే: జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీజిల్లా పరిషత్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు నాకు జిల్లా పరిషత్ అధికారులు ఎవరూ చెప్పలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా బదిలీల కౌన్సెలింగ్జెడ్పీ చైర్మన్ అనుమతితోనే జరగాలి. దీనిపై పంచాయతీరాజ్ కమిషనర్‌కు కూడా ఈమెయిల్ చేయడంతోపాటు ఫోన్లో కూడా తెలియజేశా. ఆయన కూడా జెడ్పీ చైర్మన్ సమక్షంలోనే నిర్వహించాలని అన్నారు. కానీ జెడ్పీ అధికారులు మాత్రం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామనడం చట్టాన్ని అవమానించడమే. ఇది పూర్తిగా నేరమే. జీవో నెంబర్ 707 ప్రకారమే బదిలీలు... జీవో నెంబర్ 707 ప్రకారమే తాము బదిలీలు నిర్వహిస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు కమిటీ ద్వారా బదిలీల పక్రియ చేపట్టాం. ఇందులో ఎటువంటి అన్యాయానికి, అవమానానికి తావులేదు. మొత్తం 300 మందికిపైగా బదిలీలు చేయాల్సి ఉంది. అంతా సజావుగా నిర్వహిస్తాం. నవంబరు 22 ఓ బ్లాక్ డే: ఈదర హరిబాబు ప్రకాశం జిల్లా పరిషత్ చరిత్రలో 2014 నవంబరు 22వ తేదీ బ్లాక్‌డే. న్యాయస్థానం ఉత్తర్వులను సైతం అమలు చేయకుండా జెడ్పీ సీఈవో కోర్టుని అవమానించారు. జెడ్పీకి ఎన్నికైన పాలకవర్గం ఉన్నప్పటికీ చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధం లేకుండా రెవెన్యూ ప్రతినిధులతో కమిటీగా ఏర్పడి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించి జెడ్పీ వ్యవస్థనే అపహాస్యం చేశారు. నైతికంగా జడ్పీ సీఈవోగా పనిచేసే హక్కు, అధికారం ఆయన కోల్పోయారు. మరోవైపు బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వాటినీ ధిక్కరించారు. అధికారుల వ్యవహార శైలిపై న్యాయపరంగా పోరాటం చేస్తాం. భారీ బందోబస్తు కౌన్సెలింగ్ ఆవరణలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఒంగోలు డీఎస్పీతోపాటు పలువురు సీఐలు కూడా అక్కడే విధి నిర్వహణలో ఉండి పర్యవేక్షించారు. -ఒంగోలు -
జెడ్పీ చైర్మన్‌ను నేనే
ఒంగోలు: జెడ్పీ చైర్మన్‌ను తానేనని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా పరిషత్ చైర్మన్ ఛాంబరులో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడుతూ రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో తాను తాత్కాలికంగా మూడు నెలలపాటు జెడ్పీ చైర్మన్ పదవికి దూరం కావాల్సి వచ్చిందన్నారు. విప్ ధిక్కరించానంటూ జిల్లా కలెక్టర్ తన జెడ్పీటీసీ సభ్యత్వాన్ని రద్దుచేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై న్యాయం పోరాటం చేయగా రాష్ట్ర హైకోర్టు తనకు ఇచ్చిన విప్ చెల్లదని పేర్కొనడంతో జెడ్పీటీసీకి అర్హుడినయ్యానని, జెడ్పీటీసీగా అర్హుడినైనప్పుడు జెడ్పీ చైర్మన్ పదవి కూడా ఆటోమేటిక్‌గా అర్హుడినేనని అన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి తిరిగి జెడ్పీ చైర్మన్‌గా విధుల్లోకి వచ్చినట్టేనని, అయితే ఛాంబర్లోకి మాత్రం కార్తీక మాసం, సోమవారం కావడంతో ఈ రోజు అడుగు పెట్టానని అన్నారు. తనను అనర్హుడిగా చేసేందుకు అధికార పార్టీ వారికి ఉన్న అవకాశాన్ని వారు వినియోగించుకున్నారని మాత్రమే వ్యాఖ్యానించగలనని, కోర్టు పరిధిలోని అంశం కావడం, తాను జెడ్పీ చైర్మన్ పదవిలో ఉన్నందున రాజకీయ అంశాలపై మాట్లాడదలుచుకోలేదన్నారు. తన పదవికి సంబంధించి జరుగుతున్న సమస్యంతా టీడీపీ రాష్ట్ర పార్టీకి ఎటువంటి సంబంధంలేదని, కేవలం స్థానిక రాజకీయ పరిణామాల్లో ఇదో చిన్న అంశం మాత్రమేనని అన్నారు. త్వరలోనే అది సమసిపోతుందని భావిస్తున్నానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పని చేస్తూ రాష్ట్రాభివృద్దిలో భాగం పంచుకుంటానన్నారు. జడ్పీచైర్మన్ సీట్లో కూర్చునే ముందు ఇప్పటివరకు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేసిన నూకసాని బాలాజీతో మాట్లాడానని, ఆయన కూడా తనకు శుభాకాంక్షలు తెలిపారన్నారు. ప్రజా దర్బార్లతో... ఈ పరిణామాలతో ఉద్యోగుల్లో కొంత అలసత్వం చోటుచేసుకుందని, కేవలం మూడు నెలల్లోనే జెడ్పీ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తానన్నారు. దీనికిగాను జెడ్పీకి సంబంధించిన ప్రతి వ్యవహారాన్నీ ఆన్లైన్లో పెట్టనున్నట్టు చెప్పారు. జెడ్పీ పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజా దర్భార్ను నిర్వహిస్తానన్నారు. జిల్లాలోని 56 మంది జెడ్పీటీసీలతో కలిసి రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తానని, ఇప్పటివరకు నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇక ఆగిపోతుందని భావిస్తున్నానన్నారు. అయితే టీడీపీ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోందని విలేకర్లు ప్రశ్నించగా అటువంటి పరిస్థితి వస్తే తాను కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు తాను వారసుడిని అన్నారు. నాగులుప్పలపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ ఖాజావలీ తదితరులు పాల్గొని ఈదర హరిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. -
జెడ్పీలో మరో వివాదం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మరోసారి వివాదంలో పడింది. జెడ్పీటీసీ పదవికి అనర్హుడిని చేస్తూ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను శుక్రవారం హైకోర్టు కొట్టివేయడంతో సోమవారం హడావిడిగా ఆ సీటులో ఈదర హరిబాబు ఆశీనులుకావడం వివాదాస్పదంగా మారింది. హైకోర్టు ఆదేశాలు కలెక్టర్‌కు అందిన తర్వాత దాన్ని పంచాయతీరాజ్ కమిషనర్‌కు పంపించాలి. అక్కడి నుంచి ఆదేశాల వచ్చిన తర్వాత మళ్లీ సీటులో కూర్చోవాల్సిన ఈదర అవేవీ పట్టించుకోకుండా ..జిల్లాపరిషత్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నూకసాని బాలాజీ లేని సమయంలో జెడ్పీ కార్యాలయానికి వెళ్లి సీట్లో కూర్చోవడమే కాకుండా విలేకర్ల సమావేశం కూడా పెట్టారు. ఈదర హరిబాబుపై సస్పెన్షన్ వేటు పడటంతో పూర్తిస్థాయి ఛైర్మన్‌గా నూకసాని బాలాజీకి అధికారులు బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అధికారుల నుంచి ఈదర హరిబాబుకు ఆదేశాలు రావాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాత నూకసాని బాలాజీతో మాట్లాడి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. అయితే నూకసాని బాలాజీ శ్రీశైలం వెళ్లిన సమయంలో ఈదర వచ్చి సీటులో కూర్చున్న తరువాతనే బాలాజీకి ఫోన్ చేసి ఛైర్మన్‌ను మాట్లాడుతున్నానని చెప్పడంతో నూకసాని బాలాజీ మంచిది, కంగ్రాట్స్ అని సమాధానమిచ్చారు. దీనిపై నూకసాని బాలాజీ మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను అమలు చేసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని, అధికారులకు ఆదేశాలు రాకముందే వచ్చి సీట్లో కూర్చోవడం అహంకారపూరితమేనని విమర్శించారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఈదర తెలుగుదేశం నేతల మద్దతు కోసం ప్రయత్నించారు. అయితే ఈదరకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించడానికి ఆ పార్టీ నేతలు ఇష్టపడలేదని సమాచారం. తాను వారి మద్దతు కోసం చేయి చాచినా తిరస్కరిస్తున్నారని, రాష్ట్రస్థాయిలో తనకు సహకారం ఉన్నా జిల్లాలో ‘ఇద్దరు’ తనను వ్యతిరేకిస్తున్నారని ఈదర వ్యాఖ్యానించడం గమనార్హం. అదివారం జిల్లా మంత్రిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లి రెండు గంటలపాటు వేచి చూసినా మంత్రి శిద్దా రాఘవరావు కలవడానికి ఇష్టపడలేదని తెలుగుదేశం శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈదర హడావిడిగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించిన సుజనా చౌదరిని కలిశారు. అయితే ఆయన కూడా సానుకూలంగా స్పందించలేదని సమాచారం. మరోవైపు హైకోర్టు తీర్పుపై తెలుగుదేశం నాయకులు సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో హడావిడిగా ఈదర జెడ్పీ సీట్లో కూర్చున్నట్లు సమాచారం. వారి మద్దతు కోరుతున్నానని చెబుతున్న ఈదర అవసరమైతే సుప్రీం కోర్టులో కూడా వారితో పోరాటానికి సన్నద్దమేనని చెప్పారు. కోర్టు ఆదేశాలు అందకుండానే బాధ్యతలు స్వీకరించడానికి ఈదర వస్తున్నట్టు తెలుసుకున్న జెడ్పీ అధికారులు ఎందుకైనా మంచిదని అందుబాటులో లేకుండా పోయారు. ఈదర వ్యవహరంపై జిల్లా కలెక్టర్ విజయకుమార్‌తో ‘సాక్షి’ మాట్లాడగా తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. కోర్టు ఆదేశాలు కూడా తనకు అందలేదని స్పష్టం చేశారు. -
బాధ్యయతలు తీసుకున్న ఈదర హరిబాబు
-
ఈదర పిటిషన్ కొట్టివేత
ఒంగోలు సెంట్రల్: జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఈదర హరిబాబు అనర్హుడని ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులపై జిల్లా కోర్టులో ఈదర దాఖలు చేసిన పిటిషన్‌ను మొదటి అదనపు జిల్లా జడ్జి, ఎస్కె మహ్మద్ ఇస్మాయిల్ మంగళవారం కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు ఈదర హరిబాబు జెడ్పీ అధ్యక్షుడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎన్నికయ్యారు. దీంతో టీడీపీ విప్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. తమ పార్టీ తరఫున గెలిచి, తాము జారీ చేసిన విప్‌ను ధిక్కరించి పార్టీ అభ్యర్థికి ఓటు వేయకపోగా, మరో పార్టీ మద్దతుతో జెడ్పీ అధ్యక్షుడిగా ఎన్నికవడం చెల్లదని రిటర్నింగ్ అధికారైన జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై ఆర్వో హరిబాబుకు నోటీసు జారీ చేశారు. అనంతరం విచారణ నిర్వహించారు. విచారణ సందర్భంగా విప్‌ను తాను తీసుకోలేదని, తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని ఈదర తెలిపారు. విప్ జారీ చేసినట్లు సంబంధిత పత్రాలను ఆర్వోకు టీడీపీ నేతలు అందజేశారు. విచారణ అనంతరం విప్ ఉల్లంఘించినట్లు నిర్ధారించి అనర్హుడిగా కలెక్టర్ ప్రకటించారు. ఈ తీర్పుపై ఉమ్మడి రాష్ట్ర కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దిగువ కోర్టులో పరిష్కరించుకోవాల్సిందిగా హైకోర్టు పిటిషనర్‌కు సూచించింది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం కోర్టు ఈదర పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. -
విప్ ఇవ్వలేదు... ఇంకా ధిక్కరించేదెక్కడ
ఒంగోలు : అసలు నాకు విప్ ఇవ్వలేదు. ఇంకా ధిక్కరించే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుంది. ఇదీ... విప్ ధిక్కరించినందుకు ప్రిసైడింగ్ అధికారి ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఈదర హరిబాబు ఇచ్చిన సమాధానం. ఈనెల 13న జరిగిన జెడ్పీ ఛైర్మన్ ఎన్నికలో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా ఇచ్చిన మద్దతుతో చైర్మన్ గా ఈదర హరిబాబు గెలిచిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ సీరియస్‌గా స్పందించిన ఈదర హరిబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా విప్ ధిక్కరించినందుకు అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ప్రిసైడింగ్ అధికారి హోదాలో కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. గడువు ముగియటంతో డీఆర్వోకు ఈదర హరిబాబు సమాధాం అందచేశారు. అందులో అసలు తెలుగుదేశం పార్టీ తనకు విప్ జారీ చేయలేదని, అందువల్ల తనకు విప్ గురించి తెలియదని సమాధానం ఇచ్చారు. విప్ ఇవ్వనపుడు దాన్ని ధిక్కరించే ప్రశ్న ఉత్పన్నం కాదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈదర సమాధానంపై కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
తెలుగు తమ్ముళ్లకు హరి ఝులక్!
ఒంగోలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అడ్డదారులు తొక్కుతున్న టీడీపీకి ఆ పార్టీకే చెందిన తిరుగుబాబు అభ్యర్థి ఈదర హరిబాబు ఝులక్ ఇచ్చారు. దౌర్జన్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని సొంతం చేసుకునేందుకు పచ్చబాబులు పన్నిన కుయుక్తులను పటాపంచలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండతో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. మెజారిటీ లేకపోయినా జెడ్పీ పీఠంపై కన్నేసిన తెలుగు తమ్ముళ్లకు హరిబాబు తగిన గుణపాఠం చెప్పారు. అధికార మదంతో అడ్డదారిలో పదవి దక్కించుకుందామన్న టీడీపీ కుతంత్రానికి అడ్డుకట్ట వేశారు. అరాచకాండతో ప్రజల తీర్పును అపహాస్యం చేయాలని చూసిన సైకిల్ పార్టీకి చెక్ పెట్టారు. తాము తీసిన గోతిలో తామే పడి తెలుగు తమ్ముళ్లు గిల గిల తన్నుకుంటున్నారు. తప్పుడు కేసులో మార్కాపురం జెడ్పీటీసీని అరెస్టు చేయించి తన కుట్రకు తెరలేపింది. ఇక్కడ నుంచి పరిణమాలు వేగంగా మారిపోయాయి. గెలుపు తమదే ఉన్న దీమాతో ఉన్న టీడీపీకి వైఎస్ఆర్ సీపీ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. స్వతంత్ర అభ్యర్థి హరిబాబుకు మద్దతు ప్రకటించి జెడ్పీ పీఠం కట్టబెట్టింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన వైఎస్ఆర్ సీపీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది. రెండు పదవులు కోల్పోయి తెలుగు తమ్ముళ్లు ఖిన్నులయ్యారు. పలు జిల్లాల్లో దౌర్జన్యంగా జెడ్పీటీసీ పదవులు దక్కించుకున్న టీడీపీ నాయకులు సీన్ రివర్స్ అయ్యే సరికి ఆగమాగం అవుతున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికే..
-
ప్రకాశం జెడ్పీ చైర్మన్‌గా స్వతంత్ర అభ్యర్థి
-
ప్రకాశం జడ్పీ ఛైర్మన్ గా స్వతంత్ర అభ్యర్థి హరిబాబు
ప్రకాశం: జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈదర హరిబాబు ప్రకాశం జడ్పీ ఛైర్మన్ గా ఎంపికయ్యారు. టీడీపీ జడ్పీటీసీగా గెలుపొందిన హరిబాబు.. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి ఒక ఓటు తేడాతో టీడీపీ అభ్యర్థి మన్నె రవీంద్రపై గెలుపొందారు. చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థిగా తెరపైకి వచ్చిన హరిబాబుకు వైఎస్సార్ సీపీ సభ్యులు మద్దుతు తెలిపారు. దీంతో హరిబాబుకు 28 ఓట్లు రాగా, రవీంద్రకు 27 ఓట్లు వచ్చాయి. ఎన్నికల ప్రక్రియ కాసేపు నిలిచిపోయినా హరిబాబు వర్గం తీవ్రంగా పట్టుబట్టడంతో ఎన్నికల ప్రక్రియ అనివార్యమైంది. ఈదర హరిబాబు గెలుపులో వైఎస్సార్ సీపీ కీలక పాత్ర పోషించింది. హరిబాబుకు వైఎస్సార్ సీపీ తరపున గెలిచిన 27 మంది జడ్పీటీసీలు సహకరించారు. జిల్లా ఛైర్మన్ గా హరిబాబు గెలిచినట్లు కలెక్టర్ విజయ్ కుమార్ ప్రకటించారు. ఇదిలా ఉండగా జడ్పీ వైస్ ఛైర్మన్‌గా వైఎస్సార్ సీపీ అభ్యర్థి నూకసాని బాలాజీ ఎంపికయ్యారు. అంతకముందు జడ్పీ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కన్పించాయి. టీడీపీ నేతలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎలాగోలా ప్రలోభాలతో దక్కించుకోవాలని యత్నించారు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన హరిబాబు నామినేషన్‌తో టీడీపీ రెండుగా చీలిపోయింది. చివరకు మంత్రి శిద్ధా రాఘవరావు రంగంలోకి దిగి హరిబాబును బుజ్జగించే యత్నం చేసినా ఫలితం దక్కలేదు.