ఒంగోలు: జిల్లాలోని జెడ్పీ స్కూళ్లను రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తయారుచేయూలని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు పిలుపునిచ్చారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమీక్షించారు. ప్రహరీ ఉన్న పాఠశాలల్లో నర్సరీ ఏర్పాటుతోపాటు జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్లను కూడా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
తరగతి గదులను డిజిటలైజ్ చేయడం, ల్యాబ్, లైబ్రరీ, రక్షిత తాగునీరు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. యోగ, వ్యాయామ విద్యను నేర్పాలన్నారు. రాత్రిపూట సైతం ప్రైవేటు క్లాసుల నిర్వహణకు ఉపాధ్యాయులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాఠశాల ఉన్న గ్రామంలోనే నివాసం ఉండాలని సూచించారు. దీనిపై ఉపాధ్యాయ నేతలు మాట్లాడుతూ కనీసం మండల కేంద్రంలో అయినా ఉండేందుకు అవకాశం కల్పించాలన్నారు. సీనియర్ స్టూడెంట్లకు యోగా నేర్పడం ద్వారా మాత్రమే సక్సెస్ కాగలమని వివరించారు. ప్రతి ఏటా బెస్ట్ స్కూల్స్, బెస్ట్ ప్రధానోపాధ్యాయులను గుర్తించి వారికి అవార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలవాలి
Published Wed, May 4 2016 12:27 PM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM
Advertisement