అంతుచిక్కని ప్రశ్నగా రుణమాఫీ
జిల్లాకు చేరని వివరాలు
రెండ మూడు రోజుల్లో స్పష్టత
విశాఖపట్నం: నేడే విడుదల అన్నట్టుగా..ఏ రోజుకారోజు వాయిదా పడుతూ వచ్చిన మూడో విడత రుణమాఫీ జాబితా ఎట్టకేలకు విడుదలైంది. అర్హత పొందిన రైతుల జాబితాను శుక్రవారం ఆన్‌లైన్‌లో పెట్టారు.మధ్యాహ్నం నుంచి వెబ్‌సైట్ ఓపెన్ కావడంతో తమ రుణాలు మాఫీ అయిందో లేదో తెలుసుకునేందుకు అన్నదాతలు ఇంటర్నెట్‌ల చుట్టూ తిరిగడంమొదలుపెట్టారు. కాగా జిల్లాలో ఎంతమందికి ఏమేరకు మాఫీ అయింది? ఎంత సర్దుబాటు అయిందో మాత్రం అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. జిల్లాలో 3.87లక్షల మంది రైతుల ఖాతాలుండగా వాటి పరిధిలో పంట, గోల్డ్ రుణాలు కలిపి రూ1250కోట్ల రుణాలున్నాయి. రూ.50వేల లోపు రుణాలున్న వారికి ఒకేసారి మాఫీ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చిన సర్కార్ గతేడాది డిసెంబర్ 6వ తేదీన తొలి విడత రుణమాఫీ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 1,25,069 మందికి రూ.349.34కోట్ల మాఫీ చేస్తున్నట్టు ప్రకటించిన సర్కార్ తొలి ఏడాదిలో రూ.157.18 కోట్లు సర్దుబాటు చేయనున్నట్టు చెప్పు కొచ్చింది. దీంతో మిగిలిన 2.50లక్షల మంది రైతులు గగ్గోలు పెట్టారు. రెండోవిడతలో న్యాయం చేస్తామంటూ నమ్మబలికి ఊరించి ఈ ఏడాది ఏప్రిల్ 6న రెండో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో 1,08,240 మందికి రూ.357.32కోట్లు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించి తొలి ఏడాది రూ. 162.28 కోట్లు సర్దుబాటు చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.
మిగిలిన లక్షా 50వేల మంది రైతులు మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే..మూడో జాబితా ఉందని చెప్పుకొచ్చింది. వీరిలో లక్ష మంది వరకు రైతులకు అసలు ఆధార్ కార్డుల్లేవనే సాకుతో అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన 50వేల మంది నాలుగు నెలలుగా మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారుల చుట్టూ..బ్యాంకర్ల చుట్టూచెప్పులరిగాలే తిరిగారు. చివరకు ప్రత్యేకగ్రీవెన్స్ పెట్టి వీరి నుంచి అర్జీలు స్వీకరించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 45 వేల మంది రైతుల నుంచి అర్జీలు రాగా, వారిలో అర్హమైనవిగా పేర్కొంటూ 24వేల మంది వివరాలను అప్‌లోడ్ చేశారు. కాగా శుక్రవారం విడుదలైన మూడో జాబితాలో రాష్ర్ట వ్యాప్తంగా 4.74లక్షల మంది రైతులు అర్హులుగా నిర్ధారించి వారికి రూ.894కోట్లు మాఫీవర్తింపచేసింది. తొలి ఏడాది వీరికి రూ.380కోట్లు సర్దుబాటు చేస్తున్నట్టుగా ప్రకటిం చింది. జిల్లాలో తొలి రెండువిడతల్లో చోటు దక్కని వేలాది మంది రైతులు మూడో విడత లోనైనా తమకు న్యాయం జరుగుతుందని గంపెడాశతో వెబ్‌సైట్‌లోకి వెళ్తే యూ ఆర్ నాట్ ఎలిజబుల్ అంటూ రావడంతో వారంతా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
జిల్లాలో ఎంతమంది లబ్ధి పొందారోఅనే విషయంపై జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, జేసీ జే.నివాస్‌ను సాక్షి వివరణ కోరగా మూడో విడత వివరాలు ఇవ్వమని నేషనల్ ఇన్‌ఫ ర్మేటిక్ సెంటర్(ఎన్‌ఐసీ)ని కోరామని చెప్పారు. జిల్లా పరిధిలో ఎంత మంది రైతులకు ఎంత మేర మాఫీ అయిందో చెప్పమని కోరగా ఫైనాన్స్ డిపార్టుమెంట్ క్లియరెన్స్ ఇవ్వగానే జిల్లాల వారీగా జాబితాలు ఇస్తామని చెప్పారని జేసీ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ఎంతమేర లబ్దిచేకూరేది క్లారిటీ వచ్చే అవకాశం ఆయన తెలిపారు.
మూడో జాబితా విడుదల
Published Sat, Aug 8 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM
Advertisement
Advertisement