సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తిరుపతి సభలో మాట్లాడుతూ వైఎస్సార్ జీవించి ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదని అన్నారు. ైవె ఎస్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను, 23 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. జగన్‌బాబు పూరించిన సమైక్య శంఖారావంగా, విభజనకు వ్యతిరేకంగా షర్మిల జనంలోకి వస్తున్నారని, ఆమెను ఆశీర్వదించి ఆదరించాల్సిందిగా కోరారు. విభజనతో జరిగే నష్టాలు, కష్టాలను వివరించడమై ఈ యాత్ర ఉద్దేశమని స్పష్టం చేశారు. పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, పేర్నినాని, కొడాలి నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నారాయణస్వామి, ఆర్‌కే రోజా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వరప్రసాదరావు, ప్రతాప్ రెడ్డి, ఓవీ రమణ, గాయత్రీదేవి తదితరులు సభలో ప్రసంగించారు. పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, వాసిరెడ్డి పద్మ, ప్రోగ్రామ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ తదితరులు షర్మిల వెంట వచ్చారు.
షర్మిల సభలో వెలగని లైట్లు..
షర్మిల సమైక్య శంఖారావం సభ జరిగిన తిరుపతి లీలామహల్ సర్కిల్‌లోని కార్పొరేషన్ హైమాస్ లైట్లు వెలగలేదు. రోజూ సాయంత్రం 6 గంటల కల్లా హైమాస్ లైట్లను కార్పొరేషన్ సిబ్బంది వేయాల్సి ఉంది. అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు.. షర్మిల సభ జరుగుతున్న సర్కిల్, తిరుమల బైపాస్ రోడ్డులోని కొర్లగుంట సర్కిల్ నుంచి మున్సిపల్ పార్కు వరకు వీధిలైట్లు వెలగకుండా చేశారు. ఎస్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారని, మున్సిపల్ అధికారులు స్ట్రీట్ లైట్లు వేయలేదని తెలుస్తోంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో సభ జరుగుతున్న సమయంలో స్ట్రీట్ లైట్లు వెలిగాయి.
వైఎస్ ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు: విజయమ్మ
Published Tue, Sep 3 2013 2:43 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement