చిత్తూరు (క్రైమ్), న్యూస్‌లైన్: ‘నాకు ఓటు వేయలేదంటే నీతోపాటు మీ కుటుంబాన్ని హతమార్చుతానని’ ఎంపీటీసీ అభ్యర్థి బెదిరిస్తున్నారని నాగలాపురానికి చెందిన గురవయ్య అనే వికలాంగుడు డయల్ యువర్ ఎస్పీకు ఫిర్యాదు చేశాడు. బుధవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఎస్పీ బంగళాలో నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను సన్నిహితం సీఐ చిన్నగోవిందు స్వీకరించారు.
సత్యవేడు మండలం నాగలాపురం ఎంపీటీసీ అభ్యర్థిగా మణి అనే అతను సీపీఎం తరఫున పోటీ చేస్తున్నాడని, ఓటు వేయకపోతే చంపుతానని బెదిరించాడని గుర వయ్య ఫిర్యాదు చేశాడు. రక్షణ కల్పించాలని డయల్ యువర్ ఎస్పీకు విన్నవించాడు. పలమనేరు సినిమా హాల్స్ ఓనర్లందరూ సిండికేట్‌గా మారి, రె ట్టింపు ధరలతో సినిమా టికెట్లను విక్రయిస్తూ ప్రేక్షకులను దగా చేస్తున్నారని ఫిర్యాదు అందింది. నగరి పట్టణంలో రికార్డులు లేని తమిళనాడుకు చెందిన వాహనాలు యథేచ్చగా తిరుగుతున్నాయని ఆ ప్రాంత వాసులు ఫిర్యాదు చేశారు.
కుప్పం మండలంలోని కంగుంది, రామకుప్పం మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు మద్యం తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు పెట్టకుండా వదిలేశారని ఫిర్యాదు అందింది. కలికిరి, రొంపిచెర్ల గ్రామాల్లో నాటుసారా విక్రయూలు జోరుగా సాగుతున్నాయని, రామకుప్పం వైన్‌షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. వీటితోపాటు సివిల్ తగాదాలు, కుటుంబ సమస్యలు తదితర వాటితో పాటు మొత్తం 20 ఫిర్యాదులు అందాయి.
బెదిరిస్తున్నారని ఫిర్యాదు
Published Thu, Apr 10 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM
Advertisement