డయల్ యువర్ ఎస్పీకి ఫిర్యాదుల వెల్లువ
చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుధవారం సన్నిహితం సీఐ చిన్నగోవిందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు ఇలా ఉన్నాయి.
ములకలచెరువు మండలం పాతకోట గ్రామంలో తాము ఇల్లు కట్టుకుంటుంటే అన్వర్ సాహెబ్ కుమారులు అడ్డుకుంటున్నారని సోంపల్లెకు చెందిన అబ్దుల్లా ఫిర్యాదు చేశాడు.
గుర్రంకొండ గ్రామంలో తన కిరాణా షాపులో రూ.35 వేలు చోరీ జరిగితే ఇంతవరకు రికవరీ చేయలేదని మహ్మద్ ఫిర్యాదు చేశాడు.
గన్ రెన్యువల్ చేయాలని పుంగనూరుకు చెందిన కోటేశ్వరరెడ్డి కోరారు.
సదుంకు చెందిన మొహక్ గ్రామంలో భూమిని ఆక్రమించుకున్నాడని ఫిర్యాదు వచ్చింది.
వాల్మీకిపురంలోని సాకిరేపల్లెలో బాబు, ద్వారక నిత్యం గొడవలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు వచ్చింది.
తనపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారని ములకలచెరువుకు చెందిన అమర్‌నాథరెడ్డి ఫిర్యాదు చేశారు.
అదనపు కట్నం కోసం తమ కుమార్తెను భర్త వేధిస్తున్నాడని చిత్తూరు నగరం కట్టమంచికి చెందిన వరలక్ష్మి ఫిర్యాదు చేశారు.
కార్వేటినగరంలో పెండింగ్‌లో ఉన్న అరెస్టు వారెంట్లను పోలీసులు అమలు చేయడంలేదని ఫిర్యాదు వచ్చింది.
చోరీ కేసులో నగదు రికవరీ చేయాలని పుంగనూరుకు చెందిన ఆంజప్ప ఫిర్యాదు చేశారు.
బంగారుపాళెం మండలంలోని తుంబకుప్పంలో బెల్టుషాపులు రద్దు చేయాలని ఫిర్యాదు వచ్చింది.
ఎర్రావారిపాళెంలో వేణు సైకోలా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు ఫిర్యాదు చేశారు.
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక వ్యక్తి మోసం చేశాడని పెనుమూరుకు చెందిన హనుమంతకుమార్ ఫిర్యాదు చేశారు.
మదనపల్లెలోని ఓ కళాశాల ప్రిన్సిపాల్ మద్యం తాగివచ్చి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు వచ్చింది.
చేనేతలకు రుణాలు ఇప్పిస్తానని మదనపల్లెకు చెందిన త్యాగరాజు, నాగరాజు, పురుషోత్తం మోసం చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు.
సదుం మండలం చిరుకువారిపల్లెలో బెల్టుషాపులు అరికట్టాలని, తిరుపతి కి చెందిన రాజారెడ్డి పేపరు పెడతానని చెప్పి రూ.20 వేలు తీసుకుని పారిపోయాడని, తన భర్త రమణ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని గుడుపల్లెకు చెందిన జ్యోతి, మదనపల్లెకు చెందిన ఓ మొబైల్ దుకాణంపై ఉన్న అరెస్టు వారెంట్లు అమలు చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.
ములకలచెరువులో ఓ కేసులో ముద్దాయిగా ఉన్న మహేశ్వరరెడ్డిని పోలీ సులు అరెస్టు చేయలేదని విమలమ్మ ఫిర్యాదు చేసింది.
తన తల్లిని గుర్తుతెలియని వ్యక్తులు చంపారని, ఈ కేసును ఇంతవరకు ఛేదించలేదని మృతురాలి కుమార్తె జ్యోతి ఫిర్యాదు చేసింది.