
బెదిరిస్తే ఊరుకోం: నాని
సాక్షి, హైదరాబాద్: రాజ ధాని నిర్మాణానికి భూములు ఇస్తామనే రైతులనుంచి భూములు తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, భూములు ఇవ్వమని చెప్పే రైతులను భూములివ్వాలని బెదిరిస్తే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అధికార పార్టీని హెచ్చరించారు.
ప్రతిపక్ష పార్టీ రాజధాని కమిటీలో సభ్యుడిగా ఉన్న తాను మంగళగిరి నియోజక వర్గపరిధిలో పెనుమాక, నిడమర్రు తదితర గ్రామాలు పర్యటిస్తే చాలామంది రైతులు భూములు ఇవ్వడానికి ససేమిరా అన్నారని చెప్పారు.
చంద్రబాబు హయాంలో వ్యవసాయ మంత్రిగా పనిచేసి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఎంపీగా పనిచేసిన యలమంచిలి శివాజీ లాంటి వారే బాబు చేస్తున్న రాజధాని రాజకీయాలను వ్యతిరేస్తున్నారని తెలిపారు. ఇది కౌరవ సభను తలపిస్తోందని విమర్శించారు.