కలెక్టరేట్, న్యూస్‌లైన్: బాధితురాలికి చెల్లించాల్సిన పరిహారం విషయమై కలెక్టరేట్‌ను వేలం వేసైనా సరే చెల్లించాల్సిందేనని జిల్లాకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. అయితే వేలం కంటే ముందు పరిహారం ఎంతో తేల్చిస్తే చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు కోరడంతో కోర్టు పరిహారాన్ని నిర్ణయించేందుకు మరో అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించి గతనెల 28న విచారణ ఉండ గా, జడ్జిలేని కారణంగా వాయిదా వేస్తూ ఈనెల 5న జిల్లా కోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో అధికారులు బాధితురాలికి చెల్లించే పరిహారం విషయమై గురువారం డీఆర్వో రాంకిషన్ ఆధ్వర్యంలో లెక్కలు తేల్చేపనిలో నిమగ్నమయ్యారు. ఎందుకంటే విచారణ సమయంలో అధికారుల లెక్కలను కోర్టు ముందు ఉంచాల్సి ఉంటుందని కావునా ఆ పనిని పూర్తిచేసుకుంటున్నారు. బాధితురాలు సత్తూర్ ఎల్ల మ్మ లెక్కప్రకారం..అప్పట్లో బలహీనవర్గాలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు అధికారులు 3.04 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే అధికారులు అప్పట్లో స్పందించి బాధితురాలికి పరిహారం చెల్లించినట్లయితే రూ.20లక్షలతోనే సరిపోయేది. కానీ వారి నిర్లక్ష్యం కారణంగా వడ్డీ పెరిగిపోయి అది నాలుగింతలకు చేరింది. దీంతో పరిహారం అధికారులకు తడిసిమోపెడైంది. ఇప్పటివరకు బాధితురాలికి రూ.47.39లక్షలు చెల్లించినా లెక్కప్రకారం ఇంకా రూ.49లక్షలు చెల్లించాల్సి ఉంది.
లెక్కలను సిద్ధంచేశాం..
నిబంధనల ప్రకారం సేకరించిన భూమికి బాధితురాలికి రూ.24లక్షలు చెల్లించాల్సి ఉంది. కానీ అప్పట్లో కొంత ఆలస్యమైన కారణంగా ఇప్పటివరకు విడతల వారీగా రూ.47.39 లక్షలు చెల్లించాం. అంటే అసలుకు ధీటుగా వడ్డీ కూడా చెల్లించాం. ఇంకేమైనా చెల్లించాల్సి వస్తే రూ.5లక్షల లోపే ఉంటుంది. ఇందుకు సంబంధించిన లెక్కలన్నింటినీ సంబంధిత అధికారులతో కలిసి సిద్ధంచేసుకున్నాం. వీటిని శనివారం కోర్టు ముందు ఉంచుతాం. వీటిని పరిశీలించి కోర్టు ఎలా నిర్ణయిస్తే అలా చేస్తాం..
- డీఆర్వో రాంకిషన్
తేలని పరిహారం లెక్క!
Published Fri, Oct 4 2013 3:54 AM | Last Updated on Thu, Mar 21 2019 8:31 PM
Advertisement
Advertisement