
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం అం కురార్పణ జరగ నుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమ మోక్తంగా ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవా లకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. ఇందులో భాగంగా నేటి సాయంకాల వేళలో విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమి పూజ’ (మృత్సంగ్రహణం)తో మట్టిని సేకరించి ఛత్ర చామర మంగళవాయిద్యాలతో ఊరేగు తూ ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో మట్టితో నింపిన 9 పాళికలలో (మూకుళ్లు)– శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలతో అంకురార్పణం (బీజావాపం) చేస్తారు. కార్యక్రమానికి సోము డు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దిన దినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థిస్తారు. నిత్యం నీరు పోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 8 గంటల నుండి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఏడుతలల స్వర్ణ శేషవాహనం (పెద్దశేషవాహనం)పై తిరుమల మాడవీ ధుల్లో భక్తులకు అనుగ్రహం ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment