స్విమ్స్ మహిళా వైద్యురాలికి లైంగింక వేదింపులు | tirupati svims hospital hod harrassed a lady doctor | Sakshi
Sakshi News home page

స్విమ్స్ మహిళా వైద్యురాలికి లైంగింక వేదింపులు

Published Mon, Mar 9 2015 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

tirupati svims hospital hod harrassed a lady doctor

తిరుపతి: శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్)లో మహిళా వైద్యురాలిని ఓ ఉన్నతాధికారి లైంగికంగా వేధిస్తుండటంపై జిల్లా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు అందింది. వివరాలు... తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాధ్ జెట్టి బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తుండగా.... తిరుపతి స్విమ్స్‌లోని మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ అబీజిత్ చౌదరి గత మూడు సంవత్సరాలుగా మానసికంగా, శారీరకంగా వేదింపులకు గురిచేస్తున్నట్లు ఓ మహిళ( సీనియర్ మెడికల్ ఆఫీసర్) ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసాచారిని ఆదేశించారు. 2012 నుంచి మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ అబీజిత్ చౌదరి తనతో వివాహేతర సంబంధం కోసం ప్రయత్నించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించడం.. ఈమెయిల్స్.. మెసేజ్‌లు, ఫేస్‌బుక్‌లో అసభ్య రాతలు రాస్తూ తనను వేదిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేదింపుల విషయం స్విమ్స్‌లోని ఉన్నతాధికారులకు రెండు మూడుసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement