వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ శనివారం పులివెందులకు రానున్నారు. అందుకు సంబంధించి పర్యటన దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పులివెందుల, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ శనివారం పులివెందులకు రానున్నారు. అందుకు సంబంధించి పర్యటన దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శనివారం ఉదయం పులివెందులలో జరిగే వైఎస్ జార్జిరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే విజయమ్మ పాల్గొని జార్జిరెడ్డి విగ్రహం వద్ద నివాళులు అర్పించి, అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్థానికంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం.