సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో నమ్మక ద్రోహానికి పాల్పడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా శుక్రవారం విజయవాడలోని బెంజి సర్కిల్ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు జనసేన పార్టీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, రామకృష్ణ సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై జాతీయ రహదారి మీదుగా రామవరప్పాడు వరకు కొనసాగుతుందని పేర్కొంది.