
పాపికొండలకు మళ్లీ పర్యాటక కళ వచ్చింది.
సాక్షి, వీఆర్ పురం: పాపికొండలకు మళ్లీ పర్యాటక కళ వచ్చింది. విజయవాడ బోటు ప్రమాదం నేపథ్యంలో పర్యాటక బోట్లను రెండు వారాలుగా నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో పాపికొండల ప్రాంతం కళ తప్పింది. పూర్తి స్థాయిలో తనిఖీల అనంతరం ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న లాంచీలు, బోట్లకు అధికారులు దఫదఫాలుగా అనుమతులు ఇచ్చారు.
దీంతో పర్యాటకుల రాక తిరిగి ప్రారంభమైంది. శని, ఆదివారాల్లో వెయ్యిమందికి పైగా పర్యాటకులు రావడంతో తూర్పుగోదావరి జిల్లాలోని పోచవరం బోట్ పాయింట్, పేరంటపల్లి శివాలయం, కొల్లూరు ఇసుకతిన్నెల్లో సందడి వాతావరణం నెలకొంది.