పవిత్రం..కార్తీకం | tradition festival | Sakshi
Sakshi News home page

పవిత్రం..కార్తీకం

Oct 25 2014 5:16 PM | Updated on Sep 2 2017 3:22 PM

పవిత్రం..కార్తీకం

పవిత్రం..కార్తీకం

పవిత్ర కార్తీకమాసం శుక్రవారం ప్రారంభమైంది. సకలశుభాలు కలగాలని, కోరిన కోర్కెలు తీరాలని పరమశివున్ని వేడుకుంటూ భక్తులు శివాలయాల్లో బారులు తీరారు.

 పవిత్ర కార్తీకమాసం శుక్రవారం ప్రారంభమైంది. సకలశుభాలు కలగాలని, కోరిన కోర్కెలు తీరాలని పరమశివున్ని వేడుకుంటూ భక్తులు శివాలయాల్లో బారులు తీరారు. కార్తీకమాసం సందర్భంగా ఆలయాలు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. ప్రముఖ ఆలయాల్లో దేవాదాయ,ధర్మాదాయశాఖ అధికారులు, ఆయా ఆలయాల నిర్వాహకులు భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
 
 
  నెల్లూరులోని శ్రీభువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామివారి దేవస్థానంలో విశేష పూజలు జరిపారు. సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ఆకాశదీపం వెలిగిం చారు. శివభక్తులు శివదీక్షకు మాలధారణ చేపట్టారు. కావలి, వెంకటగిరి, గూడూరు శివాలయాల్లో భక్తులు కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేకపూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement