విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్ల నిలిపివేత | train services disrupted as power lines cut down | Sakshi
Sakshi News home page

విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్ల నిలిపివేత

Published Tue, Jan 13 2015 8:13 PM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM

విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్ల నిలిపివేత - Sakshi

విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్ల నిలిపివేత

కావలి: నెల్లూరు జిల్లా కావలి రైల్వేస్టేషన్ సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. చెన్నై ఎక్స్ ప్రెస్ ను గూడూరులో నిలిపివేశారు. సర్కార్, తిరుమల, నారాయణాద్రి, జీటీ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి.

రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు పలు ఇబ్బందుల పాలవుతున్నారు. విద్యుత్ లైన్లను పునరుద్ధరించేవరకు రైళ్ల రాకపోకలు సాగే అవకాశం కనిపించడంలేదు. అసలే సంక్రాంతి సీజన్ కావడంతో రైళ్లన్నీ కిక్కిరిసి ఉంటున్నాయి. ఈ సమయంలో ఇలా జరగడంతో పిల్లా పాపలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement