రాష్ట్రంలో రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 28న
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 28న విజయవాడలో బంద్ నిర్వహించనున్నట్లు ఆటో యూనియన్లు, కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించాయి. విజయవాడలో మంగళవారం రవాణా ఎగుమతులు, దిగుమతులు ఉండవని ఏపీ లారీ అసోసియేషన్ ఆదివారం తెలిపింది.
పెద్ద నోట్ల రద్దుతో రవాణా రంగం కుదేలవడమే కాక, చలానా ఫీజులు భారీగా పెంచడంపై రాష్ట్రంలోని డ్రైవర్లు, వాహన యజమానులు ఆందోళనలో ఉన్నారు. ఫైనాన్స్ ఎండార్స్‌మెంట్ రూ. 100 నుంచి ఏకంగా రూ. 3 వేలకు పెంచడం, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఆలస్యమైతే అదనంగా రోజుకు రూ. 50 వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.