
కేంద్ర మంత్రికి వినతిపత్రమిస్తున్న గోకరాజు గంగరాజు ఎంఎస్‌ఓ ప్రతినిధులు
విజయవాడ: ట్రాయ్ కొత్త టారిఫ్ పెంపుదలకు కొంత గడువు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ఎంఎస్‌ఓల ఫెడరేషన్ ప్రతినిధులు కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి రాజ్‌వర్ధన్ సింగ్‌కు తెలుగు రాష్ట్రాల ఎంఎస్‌ఓ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. కొత్త టారిఫ్‌ను ఈనెల 29న అర్ధరాత్రి నుంచి అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. సుప్రీం తీర్పును అడ్డం పెట్టుకుని పే చానళ్ల ప్రతినిధులు అమాంతం ధరలు పెంచుతున్నాయన్నారు. దీనిపై చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల ఎంఎస్‌వోల ప్రతినిధులు టీవీ.రమేష్ బాబు, శ్రీనివాసరావు, సుభాష్ రెడ్డి నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజుతో కలిసి కేంద్ర మంత్రికి వినతిపత్రమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment