new tariff plans
-
పగటిపూట 20% తక్కువ.. రాత్రిపూట 20% ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో త్వరలో కొత్త విద్యుత్ టారిఫ్ అమల్లోకి రానుంది. పగటిపూట వినియోగం తక్కువగా ఉండే సమయంలో విద్యుత్ వాడుకుంటే చార్జీలు 20 శాతం వరకు తగ్గుతాయి. రాత్రిపూట వినియోగం అధికంగా ఉండే సమయంలో విద్యుత్ ఉపయోగించుకుంటే చార్జీలను 20 శాతం మేర పెంచుతారు. ఈ మేరకు టైమ్ ఆఫ్ ద డే(టీఓడీ) టారిఫ్ పేరిట కొత్త విద్యుత్ నియమాలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త టారిఫ్‌ను అమలు చేయడం వల్ల పీక్ సమయాల్లో గ్రిడ్‌పై భారంతోపాటు విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని తెలియజేసింది. ఈ నూతన విధానం 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదట వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. సంవత్సరం తర్వాత.. అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయ రంగం మినహా మిగతా అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు ఈ నిబంధనలను వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, నూతన టారిఫ్ విధానంతో వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అభిప్రాయపడ్డారు. లైట్లు, ఫ్యాన్లు, ఏసీల వినియోగం రాత్రిపూటే ఎక్కువ కాబట్టి వినియోగదారులపై భారం పడుతుందని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. -
వీక్షకులకు సంక్రాంతి బంపర్ ఆఫర్..
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారులకు రూ 130కు వంద ఛానెళ్ల స్ధానంలో 200 ఛానళ్లను వీక్షించే వెసులుబాటు కల్పిస్తూ ట్రాయ్ న్యూ టారిఫ్ ఆర్డర్ (ఎన్టీఓ)కు సవరణలు చేసింది. ప్రసార భారతి ఛానళ్లు కాకుండా 200 ఛానళ్లను రూ 130కే వీక్షించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ వెల్లడించారు. వినియోగదారులకు అత్యధిక ఛానళ్లను అందించేలా ఎన్‌టీఓలో నిబంధనలు మార్చామని ఆయన పేర్కొన్నారు. ఛానళ్ల అనైతిక పోటీ, అతిక్రమణలకు పాల్పడకుండా ఈ మార్పులు చేపట్టామని చెప్పారు.గతంలో వినియోగదారుల ఉద్దేశాలను ప్రతిబింబించకుండా, వారి ఎంపికకూ విఘాతం కలిగేలా వ్యవహరించే పద్ధతిని ఎన్‌టీఓలో మార్పుల ద్వారా నిలువరించగలిగామని ట్రాయ్ చైర్మన్ వెల్లడించారు. తాజా మార్పులతో బొకే కింద అందించే పే చానళ్ల గరిష్ట ధర రూ. 19 నుంచి రూ. 12కి తగ్గుతుంది. ప్రతి చానల్‌కు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ తమకు అనువైన రేటును వసూలు చేసినా, సదరు చానల్‌ను ఇతర చానళ్లతో కలిపి గంపగుత్తగా (బొకే) ఆఫర్ చేసేటప్పుడు గరిష్ట ధర రూ. 12కి (పన్నులు అదనం) మించరాదు. -
ఉచిత చానళ్ల సంఖ్య పెంపు
న్యూఢిల్లీ: కేబుల్ టీవీ చార్జీల భారాన్ని కాస్త తగ్గించేలా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకటించింది. దీంతో మరిన్ని చానళ్లు.. ఇంకాస్త చౌక రేటుకు అందుబాటులోకి రానున్నాయి. ట్రాయ్ తన వెబ్సైట్లో ఉంచిన ఆర్డరు ప్రకారం.. ఉచిత చానళ్ల సంఖ్య పెరగనుండగా, పే చానళ్ల చార్జీలు తగ్గనున్నాయి. అలాగే, వివిధ చానళ్లను కలిపి బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు అందించే బొకే ఆఫర్లపైనా ట్రాయ్ పరిమితులు విధించింది. వీటికి సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన చర్చాపత్రాలపై పరిశ్రమవర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ మార్గదర్శకాలు రూపొందించింది. సవరించిన టారిఫ్‌లను బ్రాడ్కాస్టర్లు జనవరి 15లోగా, మల్టీ సిస్టం ఆపరేటర్లు 20లోగా ప్రచురించాల్సి ఉంటుంది. వినియోగదారులకు.. కొత్త నిబంధనల ప్రయోజనాలు మార్చి 1 నుంచి లభించనున్నాయి. ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకారం.. ► బొకే కింద అందించే పే చానళ్ల గరిష్ట ధర రూ. 19 నుంచి రూ. 12కి తగ్గుతుంది. ప్రతి చానల్‌కు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ తమకు అనువైన రేటును వసూలు చేసినా, సదరు చానల్‌ను ఇతర చానళ్లతో కలిపి గంపగుత్తగా (బొకే) ఆఫర్ చేసేటప్పుడు గరిష్ట ధర రూ. 12కి (పన్నులు అదనం) మించరాదు. ► రూ. 130 నెట్వర్క్ కెపాసిటీ ఫీజు (ఎన్సీఎఫ్)తో ప్రస్తుతం 100 ఉచిత చానళ్లు లభిస్తుండగా.. ట్రాయ్ ఆదేశాల ప్రకారం ఈ సంఖ్య 200కు పెరగనుంది. కేబుల్ టీవీ ఆపరేటర్లు, డీటీహెచ్ ప్రొవైడర్లు తమ దగ్గరున్న ఉచిత చానళ్లన్నింటినీ అందించేందుకు.. గరిష్టంగా రూ. 160 మించి ఎన్సీఎఫ్ వసూలు చేయరాదు. ► బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలకు దీటుగా డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాం ఆపరేటర్లు కూడా యూజర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు ఇవ్వొచ్చు. ఆరు నెలలకు పైగా దీర్ఘకాలిక సబ్స్క్రిప్షన్ తీసుకునేవారికి ఎన్‌సీఎఫ్‌పైన, డిస్ట్రిబ్యూటర్ రిటైల్ ధరపైన డిస్కౌంట్లు వంటివి ఇవ్వొచ్చు. ► ఒకటికి మించి టీవీలు ఉన్న ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ట్రాయ్ సమీక్షించింది. రెండో టీవీకి వసూలు చేసే ఎన్సీ ఫీజు.. మొదటి టీవీ సెట్ ఫీజులో 40 శాతాన్ని మించరాదు. ప్రతీ టీవీ కనెక్షన్‌కు వేర్వేరు చానళ్లను ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ► మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు, డైరెక్ట్ టు హోమ్ సేవల సంస్థలకు ట్రాయ్ షాక్ ఇచ్చింది. ఆయా ఆపరేటర్లు తమ చానళ్లను ప్రసారం చేసినందుకు వారికి బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు చెల్లించే నెలవారీ క్యారేజీ ఫీజుపై (ఎంసీఎఫ్) పరిమితులు విధించింది. ఒక్కో చానల్‌కు గరిష్టంగా రూ. 4 లక్షల ఎంసీఎఫ్ను నిర్ణయించింది. ఇప్పటిదాకా దీనిపై ఎలాంటి పరిమితులు లేవు. కేబుల్ టీవీ షేర్ల పతనం.. తక్కువ ధరకే అధిక చానళ్లు వీక్షించేలా ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ టీవీ ఆపరేటర్ల కంపెనీ షేర్లను అతలాకుతలం చేసింది. ఆరంభంలో బాగా పతనమైన ఈ షేర్లు చివరకు మిశ్రమంగా ముగిశాయి. సన్ టీవీ నెట్వర్క్స్, డెన్ నెట్వర్క్స్ షేర్లు 0.1–1.2 శాతం రేంజ్లో నష్టపోయాయి. డిష్ టీవీ ఇండియా 2.2 శాతం, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ 0.4 శాతం చొప్పున లాభపడ్డాయి. -
జియో షాక్..కాల్ చేస్తే.. బాదుడే!
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్ సదుపాయం అందిస్తున్న టెలికం సంస్థ రిలయన్స్ జియో (జియో) తాజాగా చార్జీల వడ్డనకు తెరతీసింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు బుధవారం ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది. కాల్ టెర్మినేషన్ చార్జీలకు సంబంధించి అనిశ్చితే చార్జీల విధింపునకు కారణమని ఒక ప్రకటనలో వివరించింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీనివల్ల ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్ చేయదల్చుకునే వారు ఐయూసీ టాప్–అప్ వోచర్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టాప్ అప్ వోచర్స్ విలువకు సరిసమానమైన డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు, దీంతో నికరంగా యూజరుపై చార్జీల భారం ఉండబోదని జియో తెలిపింది. కాల్ టెర్మినేషన్ చార్జీలు అమల్లో ఉన్నంత వరకూ 6 పైసల చార్జీల విధింపు కొనసాగనున్నట్లు పేర్కొంది. వాట్సాప్, ఫేస్‌టైమ్‌కు మినహాయింపు.. జియో యూజర్లు ఇతర జియో ఫోన్లకు, ల్యాండ్లైన్లకు చేసే కాల్స్‌కు, వాట్సాప్, ఫేస్‌టైమ్ తదితర యాప్స్ ద్వారా చేసే కాల్స్‌కు దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే ఇన్కమింగ్ కాల్స్ ఉచితంగానే కొనసాగుతాయని జియో పేర్కొంది. ప్రస్తుతం జియో యూజర్లు కేవలం డేటాకు మాత్రమే చార్జీలు చెల్లిస్తున్నారు. దీనితో దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని పొందుతున్నారు. తాజా పరిణామంతో జియో యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్ చేయాలంటే రెగ్యులర్ రీచార్జితో పాటు తప్పనిసరిగా టాప్–అప్ వోచర్స్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిబంధనల్లో అనిశ్చితి వల్లే.. సాధారణంగా ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను తమ కస్టమర్లకు అందించినందుకు గాను టెలికం సంస్థలు తమ పోటీ సంస్థల నుంచి నిర్దిష్ట చార్జీలు (ఐయూసీ) వసూలు చేస్తుంటాయి. గతంలో నిమిషానికి 14 పైసలుగా ఉన్న ఈ చార్జీలను జియో వచ్చిన తర్వాత టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ 2017లో 6 పైసలకు తగ్గించేసింది. ఇతర కంపెనీలు గగ్గోలు పెట్టినప్పటికీ 2020 జనవరి కల్లా ఐయూసీని పూర్తిగా ఎత్తివేయనున్నట్లు అప్పట్లో పేర్కొంది. అయితే, తాజాగా ఇందుకు సంబంధించిన గడువును పొడిగించాల్సిన అవసరంపై ట్రాయ్ చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఇదే ఐయూసీపై అనిశ్చితికి తెరతీసిందని జియో ఆరోపించింది. తమ నెట్‌వర్క్‌పై వాయిస్ కాల్స్‌ను ఉచితంగానే అందిస్తున్నప్పటికీ .. ఐయూసీ చార్జీల కింద పోటీ సంస్థలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు గడిచిన మూడేళ్లలో ఏకంగా రూ. 13,500 కోట్ల మేర చెల్లింపులు జరపాల్సి వచ్చిందని తెలిపింది. మిస్డ్ కాల్స్ బాగోతం.. పోటీ సంస్థలు 4జీ కస్టమర్లకు వాయిస్ టారిఫ్‌లను తగ్గించినప్పటికీ, 35–40 కోట్ల మంది 2జీ కస్టమర్లపై నిమిషానికి రూ. 1.50 చొప్పున చార్జీలు విధిస్తున్నాయని జియో ఆరోపించింది. 1 జీబీ డేటాకు కనీసం రూ. 500 వసూలు చేస్తున్నాయని పేర్కొంది. దీని కారణంగా ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియా యూజర్లు .. జియో కస్టమర్లకు మిస్డ్ కాల్స్ ఇవ్వడం మొదలుపెట్టారని జియో పేర్కొంది. తద్వారా జియో యూజర్లు సదరు మిస్డ్ కాల్స్ చేసిన వారికి తమ నెట్వర్క్ నుంచి తిరిగి కాల్స్ చేస్తున్నారని, తమపై ఐయూసీ భారం గణనీయంగా పడుతోందని పరోక్షంగా తెలిపింది. తమ నెట్‌వర్క్‌కు నిత్యం 25–30 కోట్ల మిస్డ్ కాల్స్ వస్తుంటాయని, 65–70 కోట్ల నిమిషాల అవుట్గోయింగ్ కాల్స్ నమోదవుతుంటాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రాయ్ తాజా చర్యల కారణంగా వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకునేందుకే నిమిషానికి 6 పైసల చార్జీని ప్రవేశపెట్టాల్సి వచ్చిందని వివరించింది. ‘ట్రాయ్ చర్చాపత్రంతో నియంత్రణ సంస్థ నిబంధనల విషయంలో అనిశ్చితి నెలకొంది. దీంతో తప్పనిసరై ఆఫ్–నెట్ మొబైల్ వాయిస్ కాల్స్‌పై నష్టాలను భర్తీ చేసుకునేందుకు నిమిషానికి 6 పైసల చార్జీలను విధించాల్సి వస్తోంది. ఐయూసీ చార్జీలు అమల్లో ఉన్నంత కాలం ఇది కొనసాగించాల్సి రానుంది. ఐయూసీ టాప్ అప్ వోచర్‌కు సరిసమానంగా అదనపు డేటా అందించడం జరుగుతుంది. తద్వారా నికరంగా కస్టమర్లపై టారిఫ్ పెంపు భారమేమీ ఉండబోదు‘ అని జియో తెలిపింది. మరోవైపు, ఐయూసీ పొడిగింపుపై కేవలం చర్చాపత్రాన్ని ప్రవేశపెట్టినంత మాత్రాన ట్రాయ్‌పై జియో విమర్శలకు దిగడం సరికాదని సీనియర్ ట్రాయ్ అధికారి వ్యాఖ్యానించారు. కొత్త ఐయూసీ ప్లాన్లు ఇవే.. ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్ కోసం జియో కొత్తగా నాలుగు ఐయూసీ ప్లాన్స్‌ను(టాప్ అప్స్) ప్రవేశపెట్టింది. ప్లాన్స్‌కి సరిపడా డేటా ఉచితంగా ఇస్తున్నందున ఈ ఏడాది డిసెంబర్ 31 దాకా యూజర్లపై నికరంగా అదనపు భారం ఉండబోదని జియో తెలిపింది. ఇక పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు కూడా అఫ్–నెట్వర్క్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల జార్జీలు వర్తిస్తాయి. తదనుగుణంగా ఉచిత డేటా లభిస్తుంది. కొత్త ఐయూసీ ప్లాన్లు.. ► రూ. 10 ప్లాన్: 124 నిమిషాలు. 1 జీబీ డేటా. ► రూ. 20 ప్లాన్: 249 నిమిషాలు. 2 జీబీ డేటా. ► రూ. 50 ప్లాన్: 656 నిమిషాలు. 5 జీబీ డేటా. ► రూ. 100 ప్లాన్: 1,362 నిమిషాలు. 10 జీబీ డేటా. ఐయూసీని మరింత తగ్గించే ఎత్తుగడలు: ఎయిర్టెల్ ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్‌పై చార్జీలు వసూలు చేయాలన్న జియో నిర్ణయంపై పోటీ సంస్థ భారతి ఎయిర్టెల్ స్పందించింది. ఐయూసీని బలవంతంగా మరింత తగ్గించేందుకు ఈ ఎత్తుగడలు వేస్తోందంటూ ఆరోపించింది. జియో పేరు ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ఎయిర్టెల్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రాయ్ వల్లే చార్జీలు విధించాల్సి వస్తోందనే భావన కలిగించేలా తమ పోటీ సంస్థ వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. నిజానికి ఐయూసీ పొడిగింపు అంశం కొత్తదేమీ కాదని, గతంలో చార్జీలను తగ్గించినప్పుడే ఈ అంశాన్ని ట్రాయ్ ప్రస్తావించిందని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. దేశీయంగా 2జీ యూజర్లు భారీగా ఉన్నారని, నిర్వహణ ఖర్చులతో పోలిస్తే ప్రస్తుతం 6 పైసలుగా ఉన్న టెర్మినేషన్ చార్జీలు చాలా తక్కువని పేర్కొంది. మరోవైపు, ఐయూసీపై జియోది అనవసరమైన తొందరపాటు చర్యగా వొడాఫోన్ ఐడియా అభివర్ణించింది. టెలికం రంగంలో సంక్షోభాన్ని పరిష్కరించే సత్వర చర్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నంగా వ్యాఖ్యానించింది. -
మార్చి దాకా పొడిగింపు..
న్యూఢిల్లీ: కొత్త బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ సేవల విధానం కింద టీవీ వీక్షకులు తమకు కావాల్సిన చానల్స్‌ను ఎంచుకునేందుకు నిర్దేశించిన గడువును టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా మార్చి 31 దాకా పొడిగించింది. ఒకవేళ కస్టమర్లు నిర్దిష్టంగా చానల్స్‌ను ఎంచుకోని పక్షంలో సముచితమైన ప్లాన్‌ను (బెస్ట్ ఫిట్ ప్లాన్) వారికి అందించాలని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాం ఆపరేటర్స్ (డీపీవో– కేబుల్ ఆపరేటర్లు)కు సూచించింది. ఆయా కస్టమర్ల వినియోగ ధోరణి, భాషల ప్రాధాన్యం, పాపులర్ చానల్స్ తదితర అంశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ‘ఇప్పటిదాకా చానళ్లను ఎంచుకోని సబ్స్క్రయిబర్స్ని ఉద్దేశించి గడువును మార్చి 31 దాకా పొడిగించాం. అప్పటిదాకా డీపీవోలు అమలు చేసే బెస్ట్ ఫిట్ ప్లాన్‌ను గడువులోగా ఎప్పుడైనా మార్చుకోవచ్చు. తాము ఎంపిక చేసుకున్న చానల్స్‌ను డీపీవోకి తెలియజేస్తే 72 గంటల్లో తదనుగుణంగా ప్లాన్‌ను మార్చడం జరుగుతుంది‘ అని ట్రాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. బెస్ట్ ఫిట్ ప్లాన్‌కు మారినంత మాత్రాన ప్రత్యేకంగా లాకిన్ వ్యవధి ఏమీ ఉండదని, మార్చి 31లోగా ఎప్పుడైనా మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. కొత్త బ్రాడ్‌కాస్టింగ్ విధానం గతేడాది డిసెంబర్ 29నే అమల్లోకి వచ్చినప్పటికీ.. టీవీ వీక్షకులు నచ్చిన చానల్స్‌ను ఎంపిక చేసుకునేందుకు జనవరి 31దాకా ట్రాయ్ గడువిచ్చింది. తాజాగా దాన్నే పొడిగించింది. 65 శాతం ఎంపిక పూర్తి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కోట్ల కేబుల్ కనెక్షన్లు, 6.7 కోట్ల డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నాయని అంచనా. ఇప్పటికే కేబుల్ యూజర్లు 65% మంది, డీటీహెచ్ కస్టమర్లు 35% తమకు కావాల్సిన చానల్స్‌ను ఎంపిక చేసుకున్నట్లు ట్రాయ్ పేర్కొంది. కొత్త విధానంతో సబ్‌స్క్రయిబర్స్ కోరుకునే చానల్స్‌కే చెల్లించేందుకు వెసులుబాటు లభిస్తుందని తెలిపింది. నిర్దిష్టంగా చానల్స్‌ను ఎంపిక చేసుకోని వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో బెస్ట్ ఫిట్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు వివరించింది. కస్టమరు తనకు కావాల్సిన చానల్స్‌ను ఎంపిక చేసుకునే దాకా లేదా బెస్ట్ ఫిట్ ప్లాన్‌కు బదిలీ అయ్యే దాకా పాత పథకమే కొనసాగుతుందని ట్రాయ్ పేర్కొంది. -
ట్రాయ్ కొత్త టారిఫ్ పెంపుదలకు గడువు ఇవ్వండి
విజయవాడ: ట్రాయ్ కొత్త టారిఫ్ పెంపుదలకు కొంత గడువు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఓల ఫెడరేషన్ ప్రతినిధులు కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి రాజ్వర్ధన్ సింగ్‌కు తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఓ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. కొత్త టారిఫ్‌ను ఈనెల 29న అర్ధరాత్రి నుంచి అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. సుప్రీం తీర్పును అడ్డం పెట్టుకుని పే చానళ్ల ప్రతినిధులు అమాంతం ధరలు పెంచుతున్నాయన్నారు. దీనిపై చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల ఎంఎస్‌వోల ప్రతినిధులు టీవీ.రమేష్ బాబు, శ్రీనివాసరావు, సుభాష్ రెడ్డి నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజుతో కలిసి కేంద్ర మంత్రికి వినతిపత్రమిచ్చారు. -
వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేకులు
బ్యూనస్ ఎయిర్స్: దాదాపు ఆరు నెలలుగా వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసిన అమెరికా, చైనాల మధ్య ఎట్టకేలకు సంధి కుదిరింది. వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ప్రస్తుతానికి కొత్తగా మరిన్ని టారిఫ్‌లు విధించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇవ్వగా.. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీకి చర్యలు తీసుకుంటామని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భరోసానిచ్చారు. వార్షిక జీ–20 సదస్సు సందర్భంగా దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన విందు సమావేశంలో ఈ మేరకు ఇరువురు అంగీకారానికి వచ్చారు. 2019 జనవరి 1 నుంచి 200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 25 శాతానికి పెంచకుండా.. ప్రస్తుతం 10 శాతానికే పరిమితం చేసేందుకు ట్రంప్ అంగీకరించారు. ప్రతిగా 375 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న వాణిజ్య లోటును తగ్గించేందుకు అమెరికా ఉత్పత్తులు భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు జి జిన్‌పింగ్ అంగీకారం తెలిపారు. ’అమెరికా, చైనాలకు అపరిమిత ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఫలవంతమైన చర్చలు జరిగాయి’ అని ట్రంప్ పేరిట విడుదల చేసిన ప్రకటనలో వైట్‌హౌస్ వెల్లడించింది. ట్రేడ్వార్కు తాత్కాలికంగా బ్రేకులు వేసే దిశగా ట్రంప్, జిన్‌పింగ్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ చైనా మీడియా కథనాలు ప్రచురించింది. 90 రోజుల వ్యవధి.. ముందుగా ప్రతిపాదించినట్లు జనవరి 1 నుంచి టారిఫ్‌లను 10 శాతం నుంచి 25 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు, దీంతో ఈ అంశంపై మరిన్ని చర్చలకు ఆస్కారం లభించినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరి సారా సాండర్స్ తెలిపారు. వాణిజ్య లోటు భర్తీ క్రమంలో అమెరికా నుంచి వ్యవసాయ, ఇంధన, పారిశ్రామికోత్పత్తులు మొదలైనవి గణనీయంగా కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. టెక్నాలజీ బదలాయింపు, మేథోహక్కుల పరిరక్షణ తదితర అంశాలపై తక్షణం చర్చించేందుకు ట్రంప్, జిన్‌పింగ్ నిర్ణయించినట్లు వివరించారు. ఇరు పక్షంలో 90 రోజుల్లోగా ఒక అంగీకారానికి రాలేకపోయిన పక్షంలో 10 శాతం సుంకాలను 25 శాతానికి పెంచడం జరుగుతుందన్నారు. గతంలో తిరస్కరించిన క్వాల్కామ్–ఎన్ఎక్స్పీ డీల్ తన ముందుకు వచ్చిన పక్షంలో ఈసారి ఆమోదముద్ర వేసేందుకు జిన్‌పింగ్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు శాండర్స్ వివరించారు. -
కస్టమర్లకు జియో సమ్మర్ సర్ప్రైజ్
⇒ యూజర్లకు 3 నెలల కాంప్లిమెంటరీ ఆఫరు ⇒ రిలయన్స్ జియో చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడి న్యూఢిల్లీ: టెలికం సంస్థ రిలయన్స్ జియో తాజాగా తమ ప్రైమ్ ఆఫర్ కింద సభ్యత్వ నమోదు పథకాన్ని ఏప్రిల్ 15 దాకా పొడిగించింది. ఆలోగా సభ్యత్వం తీసుకోవడంతో పాటు రూ. 303 ప్లాన్ కొనుగోలు చేసిన వారికి మూడు నెలల పాటు కాంప్లిమెంటరీ ఆఫర్ ప్రకటించింది. సభ్యత్వ నమోదుకు భారీగా స్పందన రావడంతో రూ. 303, ఇతరత్రా ప్లాన్ల కొనుగోలుకు సంబంధించిన డెడ్‌లైన్‌ను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు కస్టమర్లకు రాసిన లేఖలో జియో చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఆఫరు మార్చి 31తో ముగియాల్సి ఉంది. ఇప్పటిదాకా 7.2 కోట్ల మంది పెయిడ్ సబ్‌స్క్రయిబర్స్ ప్రైమ్ సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ‘ఉచితం నుంచి పెయిడ్‌కి మారే క్రమంలో యూజర్లకు సర్వీసుల్లో ఇబ్బందులు ఎదురవకుండా చూసేందుకు తుది గడువును పొడిగించడం జరిగింది. ఏ కారణం వల్లనైనా మార్చి 31లోగా జియో ప్రైమ్ సభ్యత్వం తీసుకోలేకపోయిన వారు ఏప్రిల్ 15 లోగా రూ. 99 చెల్లించడంతో పాటు రూ. 303 ప్లాన్ కొనుగోలు చేయడం ద్వారా సభ్యత్వం పొందవచ్చు‘ అని అంబానీ తెలిపారు. అలాగే గడువులోగా రూ. 303 ప్లాన్ లేదా అంతకు మించిన ప్లాన్‌ని ఫస్ట్ పెయిడ్ రీచార్జ్ కింద కొనుగోలు చేసిన వారికి సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ కింద తొలి మూడు నెలల సేవలు కాంప్లిమెంటరీ ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కాంప్లిమెంటరీ సర్వీసు గడువు పూర్తయ్యాకా జూలై నుంచి మాత్రమే పెయిడ్ టారిఫ్ ప్లాన్ అమల్లోకి వస్తుందని అంబానీ తెలిపారు. ఇక.. సర్వీసు నాణ్య తను మరింతగా మెరుగుపర్చే దిశగా నెట్వర్క్ విస్తరణపై భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఉచిత వాయిస్, డేటా ప్లాన్లను తొలిసారిగా ప్రవేశపెట్టిన రిలయన్స్ జియో .. ఆ తర్వాత ఉచిత ఆఫర్లను ఈ ఏడాది మార్చి 31దాకా పొడిగించిన సంగతి తెలిసిందే. -
జియో మరో కొత్త సంచలన టారిఫ్ ప్లాన్స్
న్యూఢిల్లీ : సంచలన ఆఫర్లతో టెలికాం మార్కెట్‌ను ఓ ఊపు ఊపేసిన రిలయన్స్ జియో ముందస్తుగా తాను ప్రకటించిన టారిఫ్ ప్లాన్స్ ను రేపటి నుంచి ప్రారంభించబోతుంది. ఆరు నెలల పాటు ఉచితంగా అందించిన సేవలకు స్వస్తి చెప్పి, వీటిని అమలు చేయబోతుంది. ఈ క్రమంలో అసలు ఎంతమంది జియో సిమ్ ను వాడతారు? ఎంతమంది జియో నుంచి బయటికి వచ్చేస్తారు? అనేది ప్రస్తుతం మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏప్రిల్ 1 నుంచి అమలు చేయబోతున్న టారిఫ్ ప్లాన్స్ అనంతరం కన్జ్యూమర్ బిహేవియర్ బట్టి రెండు, మూడు రోజుల్లోనే మరో కొత్త సంచలన టారిఫ్ ప్లాన్స్ ను రిలయన్స్ జియో ప్రకటించనుందని బిజినెస్ ఇన్సైడర్ రిపోర్టు చేసింది. బిజినెస్ ఇన్ సైడర్ రిపోర్టు ప్రకారం ఏప్రిల్ 1 నుంచి మూడు కీ అంశాలతో కన్జ్యూమర్ బిహేవియర్ పై కంపెనీ అధ్యయనం చేయనుంది. వాటిలో ఒకటి జియో ప్రైమ్ యూజర్లు మినహా ఎంతమంది టారిఫ్ ప్లాన్లను ఉపయోగించుకుంటున్నారు. రెండోది ఎంతమంది ప్రజలు తమ కనెక్షన్ తీసుకుంటున్నారు? ఎంతమంది జియో సిమ్ ను వాడటం ఆపివేస్తున్నారు? వంటి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని, సంచలనమైన కొత్త టారిఫ్ ప్లాన్లను కంపెనీ ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. ఈ కొత్త ప్లాన్స్ కూడా వచ్చే రెండు, మూడు రోజుల్లోనే ప్రారంభిస్తుందని రిపోర్టు పేర్కొంది. హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ నేటితో ముగుస్తున్నందున ఇదే సేవలను మరో ఏడాదంతా వినియోగించుకోవడానికి ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ ను కూడా జియో తీసుకొచ్చింది. జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కు నేడే ఆఖరి తేది. తాజా లెక్కల ప్రకారం జియోకు ఉన్న 10 కోట్ల మంది సబ్స్క్రైబర్లలో 5 కోట్ల మంది ఇప్పటికే ఈ ప్రైమ్ ఆఫర్ కోసం రూ.99 చెల్లించారు.