
రాజ్యాంగ విలువల పరిరక్షణకు కృషి చేయండి
- న్యాయవాదులు, లా విద్యార్థులకు సుప్రీంకోర్టు
- న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పిలుపు
- స్వేచ్ఛ, సమానత్వ సాధనలో సుప్రీం పాత్ర అద్వితీయం
- వ్యవస్థల పటిష్టతపై ప్రజల్లో చర్చ జరగాలి
సాక్షి, అమరావతి/కానూరు: స్వేచ్ఛ, సమానత్వం సాధనకు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు కృషి చేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వ సాధనలో సుప్రీంకోర్టు పాత్ర అద్వితీయమన్నారు. సుప్రీం న్యాయ మూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తన తండ్రి లావు వెంకటేశ్వర్లు పేరిట శనివారం విజయ వాడలోని సిద్ధార్థ లా కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ చలమేశ్వర్ "రాజ్యాంగ విలువల పెంపులో సుప్రీంకోర్టు పాత్ర" అనే అంశంపై ప్రసంగించారు.
సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ దివాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు, సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వర్లు, పి.లక్ష్మణరావు తదితరులు పాల్గొ న్నారు. రాజ్యాంగ ఆవశ్య కత, న్యాయవ్యవస్థ పటిష్ట తకు తీసుకోవాల్సి న అంశాలను ఈ సందర్భంగా జస్టిస్ చలమే శ్వర్ వివరించారు. పాలకులను నియంత్రిం చేందుకు, పాలన క్రమబద్ధీకరణకు రాజ్యాంగం ఆవశ్యమని వివరించారు.
1980 తర్వాత సుప్రీం పాత్ర అద్భుతం..
1980 తర్వాత సుప్రీంకోర్టు అద్భుత పాత్ర పోషించిందని, ఏడీఎం జబల్‌పూర్, శివశంకర్ శుక్లా కేసు భారత న్యాయవ్యవస్థలో ఓ మైలురాయి వంటిదన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు ఏర్పడినప్పుడు కోర్టుల్లో సవాల్ చేయవ చ్చన్నారు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత లభించిందన్నారు.
సుప్రీంకూ మినహాయింపులు...
ఏ వ్యవస్థా సంపూర్ణమైంది కానట్టే సుప్రీంకోర్టుకూ కొన్ని మినహాయింపులు ఉన్నాయన్నారు. రాజ్యాంగ విలువలు, వ్యవస్థల పటిష్టతపై ప్రజాబాహుళ్యంలో చర్చ జరగా లని సూచించారు. భిన్నాభిప్రాయాలు ఉండడ మే ప్రజాస్వామ్య గొప్పతనమన్నారు.
బడ్జెట్‌లో ఒక శాతం కేటాయింపులే..
ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వస్తున్న కేసుల్ని పరిష్కరించాలంటే ఒక్కో న్యాయమూర్తి ఏటా 2,500 కేసుల్ని పరిష్కరించాల్సి ఉంటుందని, న్యాయవ్యవస్థకు కేటాయింపులు ఆయా రాష్ట్ర బడ్జెట్‌లలో ఒక్క శాతానికి మించి ఉండడం లేదన్నారు.రాజ్యాంగం అమలుతోనే ప్రతి ఒక్కరు తమ హక్కులను కాపాడుకోగు లుగుతారని అన్నారు.