భారత్‌లో సునామీ హెచ్చరికల వ్యవస్థ మెరుగవ్వాలి: గుషీయాకోవ్ | tsunami warning system to be improved in India: viaceslav Gusakov | Sakshi
Sakshi News home page

భారత్‌లో సునామీ హెచ్చరికల వ్యవస్థ మెరుగవ్వాలి: గుషీయాకోవ్

Published Sat, Nov 23 2013 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

tsunami warning system to be improved in India: viaceslav Gusakov

 సాక్షి, హైదరాబాద్: ఆసియా పసిఫిక్, దక్షిణాసియా దేశాలకు సునామీల ప్రమాదం అధికంగా ఉన్నందున భారత్‌లో సునామీ హెచ్చరికల వ్యవస్థ మెరుగుపడాల్సిన అవసరం ఉందని రష్యా సైన్స్ ఆకాడమీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వియాచెస్‌లేవ్ గుషీయాకోవ్ అభిప్రాయపడ్డారు. ‘జియోస్పేషియల్ డేటా ఫర్ డిసాస్టర్ అండ్ రిస్క్ రిడక్షన్’ అంశంపై ఇక్కడి సునామీ హెచ్చరికల కేంద్రం (ఇన్‌కాయిస్)లో శుక్రవారం జరిగిన వర్క్‌షాపు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సునామీల తీవ్రత, ప్రభావాలను కచ్చితంగా అంచనా వేసేందుకు కలసికట్టుగా పరిశోధనలు జరపాలన్నారు.
 

Advertisement
Advertisement