
చదలవాడ కృష్ణమూర్తి
తిరుమల: అలిపిరి సమీపంలో తలనీలాల గిడ్డంగి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తలనీలాల కోసం కోటి 50 లక్షల రూపాయలతో బ్లేడ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
తిరుమలలో నీటి కొరత లేకుండా చేయాలని తీర్మానించినట్లు చదలవాడ తెలిపారు.