
సాక్షి, ద్వారకనగర్(విశాఖ దక్షిణం): ఈనెల 13వ తేదీన విశాఖ సాగర తీరానికి మూడు నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన టగ్ ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలపాలైన జువిన్ జోషి(24)ని మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ ఆదేశాల మేరకు బాధితుడిని ఆదివారం ముంబైలోని ఆస్పత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించినట్టు జాయింట్ కలెక్టర్–2 ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తరలింపు బాధ్యతలను జేసీ–2, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పర్యవేక్షించారు.
చదవండి: టగ్ ఆన్ ఫైర్