మానని గాయం | tungabhadra river affected for villagers | Sakshi
Sakshi News home page

మానని గాయం

Published Wed, Oct 2 2013 3:21 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

tungabhadra river affected for villagers

మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: 2009 అక్టోబర్ 2 నాటి తుంగభద్ర , కృష్ణానదుల ఉప్పెన గుర్తుకొస్తే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుం ది. వరద బీభత్సానికి ఇళ్లు, వాకిలి, గోడ్డుగోదా, ధాన్యం సర్వం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రజలు నిస్సహాయస్థితిలో ప్రాణాలను దక్కించుకున్నారు. గ్రామాలు శ్మశాలను తలపిం చాయి. ఈ చేదు ఘటన జరిగి నాలుగేళ్లు గడిచింది. జిల్లాలోని అలంపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని దాదా పు 35 గ్రామాలు పూర్తిగా నీటమునిగి ప్రజలు కేవ లం కట్టుబట్టలతో బతికిబయటపడ్డారు. బాధితులందరికీ పునరావాసం కల్పిస్తామని ఆయా గ్రా మాలను సందర్శించిన ప్రజాప్రతినిధులు హామీ ఇ చ్చి వె ళ్లి బుధవారం నాటికి నాలుగేళ్లు గడిచింది.
 
 
 అ యితే నేటికీ 75శాతం గ్రామాల్లో ఇళ్లను నిర్మించిన పాపానపోలేదు. దీంతో సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థికస్తోమత లేనివారు ఇంకా గుడారాల్లోనే జీవనం సాగిస్తున్నారు. వారిని పలకరించేవా రే కరువయ్యారు. కొల్లాపూర్, అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, అయిజ మండలాల్లోని 35 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
 
 పూర్తిస్థాయిలో దెబ్బతిన్న 12 గ్రామాల్లో పునరావాసంలో భాగంగా ఇళ్ల నిర్మాణానికి ప్ర భుత్వం చర్యలు చేపట్టింది. వీటిలో కేవలం అ యిజ మండలంలోని కూట్కనూరు, ఇటిక్యాల మండలంలోని ఆర్.గార్లపాడు, కొల్లాపూర్ మం డలం అయ్యవారిపల్లిలో గ్రామాల్లో ఇళ్ల నిర్మా ణం పూర్తిచేసి నిర్వాసితులకు అప్పగించారు. అ యితే అయ్యవారిపల్లిలో దాదాపు 150 ఇళ్లు పూ ర్తిగా దెబ్బతినడంతో వాటిస్థానంలో ప్రస్తుతం 50 ఇళ్లను ఒక ప్రైవేట్ సంస్థ నిర్మించి ఇవ్వగా, మరో 100 మంది ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారు.
 
 నేతన్న బతుకు ఛిద్రం
 ఇదిలాఉండగా చేనేతకు పేరుగాంచిన రాజోలి గ్రామంలో పునరావాస చర్యలు చేపట్టడంతో అ ధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక్క రాజోలి గ్రామంలోని 212 ఎకరాల్లో 3158 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులు నిర్ణయించి అందుకు త్వరితగ తిన ఇళ్లు పూర్తిచేయడానికి ప్ర త్యేక డిజైన్‌తో పునాదులు తీసి పిల్లర్లు వేశారు. నాలుగేళ్లుదాటినా పిల్లర్లపై కప్పుపడటం లేదు. దాదాపు 500 ఇళ్లు పునాదులు దాటి ముందుకు వెళ్లలేదు. సర్వం కోల్పోయిన దాదాపు రెండు వే ల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా కేవ లం 884 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. వడ్డేపల్లి మండలంలోని పడమటి గార్లపాడు గ్రామ ని ర్వాసితులకు ఇళ్ల స్థలపరిశీలన ప్రక్రియ జరుగుతుంది. అలాగే మానవపాడు మండలం మ ద్దూరు గ్రామంలో 550 ఇళ్లు నేలమట్టం కావడం తో ఇప్పటివరకు ఆ గ్రామప్రజల ఇబ్బందుల ను పట్టించుకోవడం లేదు. దీంతో ఆ గ్రామస్తులంతా పాములు, తేళ్లతో సహజీవనం చేస్తూ బి క్కుబిక్కుమంటూ నేటికీ గుడారాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.  
 
 ఇప్పటికీ గుడారాల్లోనే జీవనం
 అలంపూర్, న్యూస్‌లైన్: వరదల్లో సర్వం కో ల్పోయి రోడ్డునపడ్డ వరద బాధితులు ఇప్పటికీ గుడారాల్లోన్నే తలదాచుకుంటున్నారు. అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, అయి జ మండలాల్లోని 28 గ్రామాలు ముంపునకు గు రయ్యాయి. వీటిలో పూర్తిస్థాయిలో దెబ్బతిన్న 10 గ్రామాల్లో పునరావాసంలో భాగంగా ఇళ్ల ని ర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటి లో కేవలం అయిజ మండలంలోని కూట్కనూ రు, ఇటిక్యాల మండలంలోని ఆర్.గార్లపాడు గ్రామాల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి నిర్వాసితులకు అప్పగించారు. మిగిలిన గ్రామాల్లో చేపట్టి న పునరావస చర్యలు నెమ్మదించడంతో నిర్వాసితులు గుడారాల్లోనే తలదాచుకుంటు దుర్భరమైన జీవనం గడుపుతున్నారు.
 
 మావనపాడు మండలంలోని మద్దూరు గ్రామంలో ఐదేళ్ల త ర్వాత స్థల సేకరణకు గ్రహణం వీడింది. వరద గ్రామంలోని 500 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం 32 ఎకరాలు సేకరించారు. కానీ ఇప్పటికి రైతుల నుంచి కొనుగోలు చేయలేదు. ఇలా పునరావాసం కల్పనలో పురోగతిలేకపోవడంతో వ రద బాధితులకు కష్టాలు తప్పడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరావాసచర్యలు వేగవంతం చేసి బాధితులకు గూడు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement