శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం పథకాల లబ్ధిదారులంతా కుటుంబానికి కనీసం రెండు బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండేటట్లు చూడాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్పీ ఠక్కర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సోమవారం ప్రత్యక్ష లబ్ధిదారు మార్పిడి పథకం, ప్రధాన మంత్రి జనదానయోజన స్కీంలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులతో సహా అన్ని కుటుంబాలు రాష్ట్రంలో ఇప్పటికే 95 శాతం వరకు ఆధార్ సీడింగ్ కలిగి ఉన్నారనిమొత్తం 6,81,330 కుటుంబాల్లో ఇప్పటికే 4,84,939 కుటుంబాలు బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్నట్టు వివరించారు. కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు డీజీఎం రామకృష్ణారావు, డీఆర్‌డీఏ పీడీ ఎస్.తనూజారాణి పాల్గొన్నారు.
ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు అకౌంట్లు
Published Tue, Aug 26 2014 2:07 AM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
Advertisement